Begin typing your search above and press return to search.

15 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మిస్తాం.. ఏప్రిల్ నుంచే ప్రారంభంః ముఖ్య‌మంత్రి

By:  Tupaki Desk   |   31 March 2021 4:30 AM GMT
15 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మిస్తాం.. ఏప్రిల్ నుంచే ప్రారంభంః ముఖ్య‌మంత్రి
X
ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం 15.60 ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మించ‌బోతున్నామ‌ని సీఎం ప్ర‌క‌టించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్ట‌బోతున్న అతిపెద్ద కార్య‌క్ర‌మం ఇదేన‌ని వెల్ల‌డించారు.

అయితే.. గ‌తంలో నిర్మించిన‌ట్టుగా అర‌కొర వ‌స‌తుల‌తో కాకుండా.. ప‌క్క‌గా ఇళ్ల నిర్మాణం ఉండాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా ప్ర‌తీ ఇంటికి బోరు ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. నీటికి ఎలాంటి ఇబ్బందులూ రావొద్ద‌ని చెప్పారు.

మ‌రో ముఖ్య‌మైన విష‌యాన్ని కూడా అధికారుల‌కు గుర్తుచేశారు. ప్ర‌తీ ఇంటికి ఖ‌చ్చితంగా విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని ఆదేశించారు. ఏ నివాసం కూడా చీక‌ట్లో ఉండ‌డానికి వీళ్లేద‌ని అధికారుల‌కు సూచించారు జ‌గ‌న్. ‘అందరికీ నీరు అందుబాటులో ఉండాలి. నీళ్లు అందుబాటులో లేకుండా నిర్మాణం ప్రారంభించలేం. విద్యుత్ సౌక‌ర్యం కూడా క‌ల్పించాలి.’ అని అన్నారు ముఖ్యమంత్రి.

ఇదిలాఉండగా.. అప్డేట్ చేసిన ‘స్పందన’ పోర్టల్ ను కూడా ప్రారంభించారు. ప్ర‌జ‌లు అధికారులకు త‌మ‌ సమస్యలను తెలుపుకునేందుకు.. ఏపీ ప్రభుత్వం ఈ-పోర్ట‌ల్ ను అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. రోజుల త‌ర‌బ‌డి ప్ర‌జ‌లు కార్యాల‌యాల చుట్టూ తిరగ‌కుండా.. ఈ పోర్ట‌ల్ ను ప్ర‌వేశ‌పెట్టారు. ఆన్ లైన్లో అర్జీలు దాఖ‌లు చేయ‌డం ద్వారా.. సాధ్య‌మైనంత వేగంగా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ఉద్దేశంతో ఈ విధానాన్ని అందుబాటుకి తెచ్చింది ప్ర‌భుత్వం.