Begin typing your search above and press return to search.
న్యాయశాఖ మంత్రితో జగన్.. ఏపీ ప్రతిపక్షాల్లో గుబులు.?
By: Tupaki Desk | 15 Feb 2020 5:40 PM ISTఏపీ రాజకీయాలను మలుపుతిప్పేలా సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి కేంద్ర హోమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్ శనివారం ఉదయం ఏపీకి రావాల్సింది. కానీ అనూహ్యంగా కేంద్ర మంత్రులను కలిసే పనిపెట్టుకున్నారు. శనివారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను జగన్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్రంలోని బీజేపీతో దోస్తీతో ముందుకెళుతున్న జగన్ వైఖరి ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ, జనసేనలను అయోమయానికి గురి చేస్తోంది.తాజాగా వరుసగా కేంద్రమంత్రులను కలుస్తూ లాబీయింగ్ చేస్తుండడం.. వారు సానుకూలంగా జగన్ కు జై కొడుతుండడం ఏపీ రాజకీయ వర్గాలను షాక్ గురిచేస్తోంది.
తాజాగా సీఎం జగన్ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ తో చాలా సేపు భేటి అయ్యారు. ఈ భేటిలో ప్రధానంగా కేంద్ర న్యాయశాఖ పరిధిలో ఉండే శాసనమండలి రద్దు వ్యవహారం, కర్నూలుకు హైకోర్టు తరలింపు, ఏపీకి 3 రాజధానులు తదితర అంశాలపై సీఎం జగన్ కేంద్రమంత్రితో చర్చించినట్టు తెలుస్తోంది. వాటికి ఆమోదముద్ర పడేవేసుందుకు త్వరగా ప్రక్రియ పూర్తి చేసేందుకు జగన్ మంత్రాంగం నడుపుతున్నట్టు సమాచారం. మండలిని పార్లమెంట్ త్వరగా ఆమోదించేలా.. రాష్ట్రపతి గెజిట్ వచ్చేలా జగన్ చొరవతీసుకుంటున్నట్టు తెలిసింది.
ఈ భేటితో అమరావతి సహా ఏపీలోని ప్రధాన సమస్యలు పరిష్కారం అయితే టీడీపీకి, జనసేనకు రాజకీయం గా గడ్డు పరిస్థితులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.