Begin typing your search above and press return to search.

పేద‌లపై జాలి చూపిన‌ సీఎం జ‌గ‌న్‌...!

By:  Tupaki Desk   |   27 Sep 2019 12:26 PM GMT
పేద‌లపై జాలి చూపిన‌ సీఎం జ‌గ‌న్‌...!
X
కృష్ణ క‌ర‌క‌ట్ట‌పై నివాసం ఉంటున్న పేద‌లపై ఏపీ సీఎం జ‌గ‌న్ క‌నిక‌రం చూప‌డ‌మే కాకుండా - వారి జోలికి వెళ్ళ‌కుండా వారికి నివాస గృహాలు అవ‌స‌ర‌మైన చోట నిర్మించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కృష్ణాన‌ది క‌ర‌కట్ట‌ మీద‌ - క‌ర‌క‌ట్ట లోప‌ల‌ - కాల్వ గట్ల మీద నివాసం ఉంటున్న పేద‌లు నివాసాల‌పై సీఎం జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అధికారుల‌తో మాట్లాడుతూ పేద‌లు ఉంటే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల‌ని - ప‌ర్యావ‌ర‌ణ ప‌రిరక్ష‌ణ‌ - న‌దీ చ‌ట్టాల‌ను ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. అయితే క‌ర‌కట్ట‌పై అక్ర‌మ నిర్మాణాలు ఉంటే తొలగించాల‌ని ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది.

క‌ర‌క‌ట్ట‌పై నివ‌సించే ఎవ‌రైనా పేద‌ల ఇళ్లు తొల‌గించ‌బ‌డితే వారికి రెండు సెంట్ల భూమి ఇచ్చి వారికి ఇండ్లు క‌ట్టివ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పేదల నివాసాల‌పై ఉదార‌త చూపిన జ‌గ‌న్ పేద‌లు త‌న‌వారికి దూరం లేని ప్రాంతంలో ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని సూచించారు. కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట పై అక్ర‌మ నిర్మాణాల‌తో తీవ్ర‌మైన న‌ష్టం వాటిల్లుతుంద‌ని సీఎం జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. వ‌ర్షాకాలంలో ముంబై - చెన్నై న‌గ‌రాలు ఎలా మునిగిపోతున్నాయో.. ప్ర‌జ‌లు ఎలా ఇబ్బందులు ప‌డుతున్నారో చూసి అలా కాకుండా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు.

ముంబై - చెన్నై ప‌రిస్థితి రాకుండా ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేయాల‌ని - కాలువ‌ల‌కు - న‌దుల‌కు అడ్డుగా నిర్మాణాలు జ‌రుగ‌కుండా చూడాల‌ని సీఎం ఆదేశించారు. నదీపరీవాహక ప్రాంతాలకు భంగం కాకుండా మ‌నం బాధ్య‌త వ‌హించాల‌ని మంత్రులు - అధికారుల‌కు హితువు ప‌లికారు. పేద‌లు - సామాన్యుల ప‌ట్ల ఉదారంగా ఉండాలని, అయితే అక్ర‌మ నిర్మాణాల‌ను ప్రోత్స‌హించ‌కుండా వారికి ప్ర‌భుత్వ స్థ‌లాల్లో ఇళ్ళు నిర్మించి ఇస్తే ఇలా పేద‌లు అక్ర‌మ నిర్మాణాలు చేసుకునే అవ‌కాశం ఉండ‌ద‌ని, అందుకే ఎక్క‌డైనా పేద‌లు, సామాన్యులు ప్ర‌భుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకుని ఉంటే వారికి వెంట‌నే ప‌ట్టాలు ఇవ్వాల‌ని ఆదేశించారు.

రాజ‌ధానిలో అంత‌ర్భాగంగా ఉన్న తాడేపల్లి - మంగళగిరి మోడల్‌ మున్సిపాల్టీలుగా త‌యారు చేయాల‌ని - అందుకు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ - తాగునీటి వసతి - రోడ్ల అభివృద్ధికోసం ప్రతిపాదన సిద్ధంచేయాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. అదే విధంగా తాడేపల్లిలో కనీసం 15వేల ఇళ్లు ఇవ్వాలని - కట్టే ఇళ్ల సముదాయాల వద్ద కనీస మౌలిక సదుపాయాలకూ కార్యాచరణ - ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని - తాడేపల్లి మున్సిపాల్టీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని - అవినీతికి తావు లేకుండా చూసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు.