Begin typing your search above and press return to search.

ఆర్యన్ ఖాన్ కేసుపై మహా సీఎం ఉద్దవ్ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   16 Oct 2021 3:31 PM GMT
ఆర్యన్ ఖాన్ కేసుపై మహా సీఎం ఉద్దవ్ కీలక వ్యాఖ్యలు
X
మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోన్న షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తొలిసారి స్పందించారు. ఇన్నాళ్లు ఈ వ్యవహారంపై సైలెంట్ గా ఉన్న ఉన్న మహారాష్ట్ర సీఎం.. ఇవాళ తొలిసారి మాట్లాడారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్యన్ ఖాన్ కేసు వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అత్యుత్సాహం చూపుతోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే హాట్ కామెంట్స్ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు సెలబ్రిటీలను పట్టుకోవడంలో ఎక్కువగా ఆసక్తి ఉందని ఉద్దవ్ ఆరోపించారు. ఎన్సీబీ పట్టుకున్న డ్రగ్స్ గ్రాముల్లోనే ఉన్నాయని.. కానీ ముంబై పోలీసులు 150 కోట్ల విలువైన డ్రగ్స్ ముంద్రా పోర్టులో పట్టుకున్నారని థాక్రే గుర్తు చేశారు.

ఎన్సీబీకి సెలబ్రిటీలను పట్టుకోవడం.. వారిని ఫొటోలు తీసుకోవడం.. దీన్ని రచ్చ చేయడంపైనే ఎక్కువగా ఆసక్తి ఉందని థాక్రే వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర డ్రగ్ రాజధానిగా ఉందనేలా ఎన్సీబీ తయారు చేస్తోందని ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు.

ఆర్యన్ ఖాన్ కేసే కాదని.. ముంద్రా పోర్టులో దొరికి డ్రగ్స్ కోట్లు విలువ చేసేవని.. కానీ గుప్పెడు గంజాయి పట్టుకొని ఎన్సీబీ హంగామా చేస్తోందని సీఎం ఉద్దవ్ ఎద్దేవా చేశారు. ముంబై పోలీసులు రూ.150 కోట్ల హెరాయిన్ పట్టుకున్నారని ఎన్సీబీని ఎద్దేవా చేశారు.

మహారాష్ట్ర పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే కుట్ర ఇదీ అని.. దీన్ని డ్రగ్స్ కు అడ్డాగా చూపించే ప్రయత్నం చేస్తున్నా థాక్రే ఆరోపించారు. ఇలాంటి డ్రగ్స్ కేసుల వల్ల మహారాష్ట్రను ప్రజలు భూతద్దంలో చూసే పరిస్థితి వస్తోందని.. మమ్మల్ని టార్గెట్ చేస్తున్న వారు రేప్ లు, హత్యలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ను ఎందుకు ప్రశ్నించడం లేదని ఉద్దవ్ నిలదీశారు.