Begin typing your search above and press return to search.

సీఎం స్టాలిన్‌ మరో సంచలన నిర్ణయం.. ప్రజల కోసం స్పెషల్ బిల్లు

By:  Tupaki Desk   |   8 Sept 2021 4:33 PM IST
సీఎం స్టాలిన్‌ మరో సంచలన నిర్ణయం.. ప్రజల కోసం స్పెషల్ బిల్లు
X
తమిళనాడు సీఎం గా అధికారం చేపట్టినప్పటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న స్టాలిన్. తమిళనాడు లో తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరూ ఊహించని విధంగా తన పాలనను కొనసాగిస్తున్నారు. ఎవరి అంచనాలకు అందని నిర్ణయాలతో ప్రజల్లో తన క్రేజ్‌ ను పెంచుకుంటున్నారు సీఎం స్టాలిన్‌. అయితే, ఈ సంచలన నిర్ణయాలతో దూసుకెళుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ప్రజలు ఆలస్యం లేకుండా ఓ నిర్దిష్ట సమయానికి ప్రభుత్వ సేవలు పొందేందుకు రైట్ టు సర్వీస్ యాక్ట్ అనే బిల్లు తీసుకరాబోతున్నారు. దీని వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందేందుకు ప్రజలు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన బాధలు తొలగిపోనున్నాయి. అంతేకాదు, ఈ బిల్లు వల్ల ప్రజలకు సరైన న్యాయం జరగనుందని అంటున్నారు. ప్రస్తుతం తమిళనాడు సర్కార్‌ ఈ బిల్లు రూపొందించే పనిలో ఉంది. దీని కోసం ప్రత్యేకంగా అసెంబ్లీని కూడా నిర్వహించే దిశగా ఆలోచన చేస్తోంది స్టాలిన్‌ సర్కార్.

ఈ మధ్య స్టాలిన్‌ తీసుకుంటున్న నిర్ణయాల పై కేవలం ఆ రాష్ట్ర ప్రజలే కాదు టాలీవుడ్ మెగా బ్రదర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ పాలన పై పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేశారు. మరికొన్ని గంటలకే ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెళ్లి.. తమిళనాడు సీఎం స్టాలిన్ కలిశారు. ఈ రెండు అంశాలను తమిళనాడు అసెంబ్లీ లో ప్రస్తావనకు రావడం జరిగింది.

ఇదిలా ఉంటే .. సీఎం స్టాలిన్ తీసుకునే నిర్ణయాలకు విపక్షాల నుంచి కూడా ప్రశంసలు పొందుతున్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఉచితంగా ఉద్దేశించిన 65 లక్షల స్కూల్ బ్యాగ్ లపై మాజీ సీఎంలు జయలలిత,ఎడప్పాడి పళనిస్వామి ఫోటోలను కొనసాగిస్తామని ఈ మధ్యనే వెల్లడించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఇతర పార్టీకి చెందిన సీఎంలు మారితే.. ఖర్చయినా సరే అని మారుస్తారు. కానీ స్టాలిన్ మాత్రం అలా చేయలేదు. బ్యాగ్ లు మార్చాల్సి రావడంతో రాష్ట్ర ఖజానాకు రూ.13 కోట్లు ఆదా అవుతాయని స్టాలిన్ నిర్ణయించారు. అలా ఆదా అయిన డబ్బుని విద్యార్ధుల కోసం ప్రవేశపెట్టే మరో సంక్షేమ పథకంలో వినియోగించాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు.