Begin typing your search above and press return to search.

పోలీసులకే షాకిచ్చిన సీఎం బామ్మర్ధి..?

By:  Tupaki Desk   |   24 Aug 2018 3:46 PM IST
పోలీసులకే షాకిచ్చిన సీఎం బామ్మర్ధి..?
X
సీఎం బామ్మర్ధి మరీ.. ఆ మాత్రం కదరు ఉండకుంటే ఎట్టా.. అందుకే పోలీసులు కూడా అలానే భ్రమపడి సీఎం బామ్మర్ధి బండబూతులు తిడుతున్నా మిన్నకుండిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదశ్ రాష్ట్ర విధాన సభ ముందు జరిగింది.

తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడు. ఆ వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తాను ముఖ్యమంత్రి బామ్మర్ధిని అంటూ సదురు వ్యక్తి హంగామా సృష్టించాడు. సీఎం బామ్మర్ధికే జరిమానా విధిస్తారా అని ఆందోళన చేశాడు. పోలీసులను బండ బూతులు తిట్టారు. దీంతో మరికొంతమంది పోలీసులు వచ్చారు. దీంతో నిజంగానే సీఎం బామ్మర్ధి కావచ్చనే ఉద్దేశంతో పోలీసులు సర్ధిచెప్పారు..

అయితే ఈ ఘటన మీడియాలో ఫోకస్ కావడంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మధ్యప్రదేశ్ లోని మహిళలందరూ తనకు అక్కాచెల్లెళ్లని.. వారి భర్తలందరూ తనకు బావమరుదులు అవుతారని.. అందులో ఓ బావమరిది తన పేరు వాడుకొని ఉంటారని చమత్కరించారు. దీంతో పోలీసులు సదురు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.