Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే కోసం డాక్టర్‌కు సీఎం ఫోన్
By: Tupaki Desk | 6 Sept 2020 3:00 PM ISTకరోనా వైరస్‌కు చిన్నా పెద్దా.. రాజు పేదా అనే తారతమ్యాలేమీ లేవు. వివిధ వయసుల వాళ్లను, సొసైటీలో అన్ని వర్గాల వాళ్లనూ అది కాటేసింది. ప్రజా ప్రతినిధులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనాతో ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేల్లో డాక్టర్ తిప్పేస్వామి ఒకరు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ తిప్పేస్వామికి కొన్ని రోజుల కిందటే కరోనా వైరస్ సోకింది. ఆయన వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడే ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తిప్పేస్వామి గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఫోన్‌లో ఆయన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అంతే కాక సీఎం ఆసుపత్రి వైద్యులతో కూడా మాట్లాడినట్లు తెలిసింది. ఎమ్మెల్యేకు ఏ ఇబ్బందీ రాకుండా చూసుకోవాలని, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ స్వామి దినేష్‌తో కూడా సీఎం ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మరోవైపు నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కరోనా బారిన పడ్డారన్నది తాజా సమాచారం. వెంకట ప్రతాప్ కరోనా వేళ క్షేత్ర స్థాయికి వెళ్లి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా తాజాగా తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో వెళ్లి పరీక్ష చేయించుకున్నారు. ఆదివారమే ఫలితం పాజిటివ్‌గా వచ్చింది. తనకు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎమ్మెల్యే ప్రతాప్ చెప్పారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. వైకాపా అగ్ర నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు అధికార పార్టీ నేతలు కరోనా బారిన పడి చికిత్స తర్వాత కోలుకున్న సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు ఇటీవలే కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.