Begin typing your search above and press return to search.

యష్.. దర్శన్ లు పొలందున్నే జోడెడ్లు కాదు!

By:  Tupaki Desk   |   26 March 2019 12:11 PM IST
యష్.. దర్శన్ లు పొలందున్నే జోడెడ్లు కాదు!
X
సినిమా స్టార్లు రాజకీయాల్లోకి అడుగుపెట్టనంతవరకూ అంతా సవ్యంగానే ఉంటుంది ఒక్కసారి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడమో లేదా ఒక పార్టీకి మద్దతు ప్రకటించడమో చేస్తే అప్పుడు మొదలవుతుంది అసలు కథ. అప్పటివరకూ 'ఆహా.. ఓహో..' అన్నవారు చాలామంది ప్లేటు మార్చి బూతులు తిడుతూ వెధవను చేయడానికి ప్రయత్నిస్తారు. రీసెంట్ గా కన్నడ స్టార్లు యష్.. దర్శన్ లకు ఇలాంటి పరిస్థితే ఎదురయింది.

కర్ణాటకలలోని మాండ్యా నియోజకవర్గంలో సీనియర్ నటి సుమలత పోటీ చేస్తోంది. 'కేజీఎఫ్' స్టార్ యష్.. మరో స్టార్ దర్శన్ సుమలతకు తమ మద్దతు తెలిపారు. దర్శన్ ఒక అడుగు ముందుకేసి.. మేమిద్దరం పొలంలో యజమాని కోసం పనిచేసే జోడెడ్ల లాగా సుమలత గెలుపు కోసం పనిచేస్తామని భారీ డైలాగ్ చెప్పాడు. అసలే ఆ నియోజక వర్గంలో జేడీ (ఎస్) తరపున కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ బరిలో ఉన్నాడు. మరి కుమారస్వామి ఊరుకుంటాడా?

ఈ జోడెడ్లు పొలం దున్నేరకం కాదని పంటలను తొక్కి నాశనం చేసి రైతుకు నష్టం కలిగించేవని విమర్శించాడు. అంతే కాదు.. అసలు వాళ్ళకు వ్యవసాయం గురించి.. అందులో ఉన్న కష్టసుఖాల గురించి ఏం తెలుసని మండిపడ్డాడు. ఈమధ్య మండ్యాలో రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో వీరిద్దరూ అసలు ఎక్కడున్నారని ప్రశ్నించాడు. ప్రచారం ఇంకా జరుగుతోంది కాబట్టి పోను పోను ఇలాంటి డైలాగ్స్ ఎన్ని వినవలిసి వస్తుందో!