Begin typing your search above and press return to search.
కేసీఆర్, కేటీఆర్ లదీ వ్యూహాత్మక మౌనమా?
By: Tupaki Desk | 11 July 2020 8:00 AM ISTటీఆర్ఎస్ అధినేత.. సీఎం కేసీఆర్ మౌనం వెనుక పెద్ద అగ్ని పర్వతమే ఉంటుందన్నది ఆయనను దగ్గరి నుంచి చూస్తున్న వారు చెప్పే మాట.. లావాల రగులుతుంటుందని ఒకే సారి బయటపడి స్మాష్ చేస్తుందని చెబుతుంటారు. కేసీఆర్ ఎప్పుడూ రాజకీయంగా వెనుకబడినా ఒకే ఒక స్టెప్ తో దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనూ 50రోజులకు పైగా మౌనంగా ఉండి ఒకేసారి వారికి వరాలిచ్చి దేవుడైపోయాడు. దిశా హత్యాచారం విషయంలో ఎన్ కౌంటర్ చేయించి హీరో అయిపోయాడు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ 13రోజులుగా కనిపించడం లేదని ప్రతిపక్షాలు, నెటిజన్లు అందరూ ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ఎక్కడ? అన్నది ట్రెండింగ్ గా మారింది. హైకోర్టు వరకు చేరింది. కరోనా వ్యాపించిన తొలినాళ్లలో రోజూ వచ్చిన కేసీఆర్ ఇంత ప్రబలుతుంటే ఎందుకు మీడియా ముందుకు రావడం లేదన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న? ఈ విషయంలో అటు సీఎం కేసీఆర్.. ఇటు ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ కూడా నోరువిప్పడం లేదు. వీరి ఇద్దరి మౌనం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
కేసీఆర్ ఎప్పుడూ వ్యూహాత్మక మౌనం పాటిస్తారు. కానీ ఇప్పుడు ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ సైతం కౌంటర్ ఇవ్వకుండా మౌనంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకు వీరిద్దరూ మౌనం వహిస్తున్నారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే దీని వెనుక పెద్ద వ్యూహమే వుందన్న అనుమానాలు కలుగుతున్నాయి.
రెండు, మూడు రోజుల్లోనే కేసీఆర్ హైదరాబాద్ రాబోతున్నారట.. కరోనాపై, సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్షాల ప్రశ్నలకు గట్టి జవాబులు ఇచ్చేందుకు పెద్ద ప్లాన్లు చేశారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంగళవారం సీఎం కేసీఆర్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో ప్రతిపక్షాలు, మీడియాకు దిమ్మదిరిగే సమాధానాలు ఇస్తారని గులాబీ వర్గాలు అంటున్నాయి. అవి ఏంటి అనేవి మాత్రం చెప్పడం లేదు. ఈసారి కేసీఆర్ ఏం బాంబు పేలుస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.