Begin typing your search above and press return to search.
రెండు ఆసుపత్రులు తిరిగేసరికి కేసీఆర్ లో ఎంత మార్పు?
By: Tupaki Desk | 22 May 2021 9:05 AM ISTకేసీఆర్.. కాస్త బయటకు వచ్చి రెండు కరోనా ఆసుపత్రులు తిరిగేసరికి ఎంత మార్పు వచ్చేసింది? తన టీం అధికారులతో భేటీ అయిన సందర్భంగా లాక్ డౌన్ అంశంపై ఆయన స్పందించిన తీరుకు.. తాజాగా రెండు ఆసుపత్రుల్లో తిరిగి.. బాధితుల సంఖ్య.. కేసుల వివరాల్ని చూసిన తర్వాత సీఎం మాటల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కేసులు అదే పనిగా పెరుగుతున్న వేళ..రాత్రివేళ కర్ఫ్యూ నిర్ణయానికి సైతం రాష్ట్ర హైకోర్టు అదే పనిగా అడగాల్సి వచ్చింది. అంతేనా.. కేసుల తీవ్రత ఎక్కువ అవుతోంది. లాక్డౌన్ మీద మీరు నిర్ణయం తీసుకుంటారా? మమ్మల్నే తీసుకోమంటారా? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత కానీ.. హడావుడిగా లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు అన్ని వ్యాపార.. వాణిజ్య సంస్థలు తెరిచి ఉంచేలా.. తర్వాత రాకపోకల్ని పూర్తిగా నిషేధిస్తూ పరిమితులు విధించారు. అత్యవసర వస్తు సేవలకు.. వైద్యానికి లాక్ డౌన్ వర్తించకుండా నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. సీఎం కేసీఆర్ నోటి నుంచి లాక్ డౌన్ మాట చెప్పించటం కోసం చాలానే కష్టపడాల్సి వచ్చింది. కేసుల నమోదు కంటే కూడా రాష్ట్రానికి వచ్చే ఆదాయం గురించి ఆయన ఆలోచనలు తిరిగేవి.
ఎప్పుడైతే గాంధీ.. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారో.. అప్పటి నుంచి ఆయన మాటలో మార్పు కనిపిస్తోంది. ఎప్పుడో కానీ జిల్లా కలెక్టర్లతో రివ్యూ పెట్టుకునే సీఎం కేసీఆర్.. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు.. డీపీజీ.. ఎస్పీ.. కమిషన్లతో వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితి ఎలా ఉందన్న వివరాలతో పాటు.. కరోనా కట్టడి తీసుకుంటున్న కార్యాచరణ ఏమిటని అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర రెవెన్యూ నష్టం గురించి ఆలోచించొద్దని.. లాక్ డౌన్ అమలును మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించటం గమనార్హం. ‘‘ఉదయం సడలింపు ఇచ్చిన నాలుగు గంటలు మినహా.. మిగతా 20 గంటలపాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చెయ్యాలె. అలసత్వం వహించకూడదు.
ఉదయం 10గంటల 10 నిమిషాల తర్వాత పాస్ హోల్డర్స్, అత్యవసర సేవల వారు తప్ప మరెవరూ రోడ్డు మీద కనిపించకుండా చర్యలు చేపట్టాలి. సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు కరోనా కట్టడిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’’ అంటూ కేసీఆర్ సీరియస్ ఆదేశాలు జారీ చేశారు.
కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్ సరిగా అమలు జరగకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనుంచైనా కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో బాగానే అమలవుతున్నా.. పట్టణాల్లో సరిగా అమలు కావటం లేదని.. ఇకపై అలాంటి పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. అందుకే చెప్పేది.. ఫాంహౌస్ టు ప్రగతి భవన్ మధ్య మాత్రమే తిరిగితే ఉండే ఆలోచనలకు.. జనాల్లోకి వచ్చి తిరిగి.. వారితో మాట్లాడితే వచ్చే మాటల్లో తేడా ఏమిటన్నది కేసీఆర్ తాజా ఆదేశాల్ని.. ఆయన మాటల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. అందుకేనేమో.. మగాడు తిరగక చెడ్డాడు అని మన పెద్దోళ్లు సామెతగా అప్పుడెప్పుడో చెప్పేశారు.