Begin typing your search above and press return to search.

ప్రగతి భవన్‌ లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌ !

By:  Tupaki Desk   |   15 Aug 2020 5:20 PM IST
ప్రగతి భవన్‌ లో  జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌ !
X
74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ‌లోని‌ ప్రగతిభవన్‌ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నేత కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, తదితరులున్నారు. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది సమక్షంలో మాత్రమే ఈ వేడుకలు నిర్వహించారు. ఆ తరువాత సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది ఆగస్టు 15న గోల్కొండ కోట వేదికపై కేసీఆర్ జాతీయజెండాను విష్కరిస్తారన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఈసారి వేడుకల వేదికను ప్రగతి భవన్‌కు మార్చారు.

తెలంగాణలోని జిల్లాల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవం నాడు వేడుకలు ఆడంబరాలకు వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ మంత్రులు, అధికారులు ఆయా జిల్లా కలెక్టరేట్ల వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. కరోనా వే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించే 'ఎట్‌ హోం' కార్యక్రమం కూడా రద్దు అయింది. ఇక, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే ముందు వరసలో ఉందన్నారు. కరోనా కారణంగా స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, వివిధ శాఖల అధికారులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.