Begin typing your search above and press return to search.

ఆపండి మీ చప్పట్లు , సీటీలు ..నేనేమైనా సినిమా యాక్టర్‌నా ? : సీఎం కేసీఆర్

By:  Tupaki Desk   |   23 Jun 2021 7:32 AM GMT
ఆపండి మీ చప్పట్లు , సీటీలు ..నేనేమైనా సినిమా యాక్టర్‌నా ? : సీఎం కేసీఆర్
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ..మాటలు మాట్లాడటంలో , అలాగే సందర్భాన్ని బట్టి అల్లుకుపోయి మాట్లాడటం లో ఆయనకి ఆయనే సాటి. సీఎం కేసీఆర్ పెట్టె ప్రెస్ మీట్ కోసం మీడియా తో పాటుగా రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తుంది. అయన కురిపించే వరాల జల్లు కోసం కొందరు ఎదురుచూస్తుంటే , చాలామంది మాత్రం ప్రెస్ మీట్ లో అయన వేసే పంచ్ ల కోసం చాలామంది ప్రెస్ మీట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పుడే కాదు కేసీఆర్ ప్రెస్ మీట్ కానీ , ఏదైనా సభ లో మాట్లాడే సమయంలో కానీ ఛలోక్తులు విసురుతూ విమర్శలు చేస్తూనే , కామెడీ పండిస్తారు. అలాగే ఏదైనా ఎక్స్ట్రా క్వశ్చన్ అడిగినా కూడా , ఏ మాత్రం టైం తీసుకోకుండా వారికి స్ట్రాంగ్ రి కౌంటర్ ఇస్తుంటారు.

ఈ మధ్య థర్డ్ వేవ్ వస్తుంది కదా , మీరేమో తెలంగాణ రాష్ట్రంలో కనీసం రాత్రి సమయంలో కర్ఫ్యూ కూడా లేకుండా లాక్ డౌన్ ను ఎత్తేశారు అని అడిగితె , థర్డ్ వేవ్ వేస్తుంది అని ఎవరికి ఫోన్ చేసి చెప్పింది అంటూ సెటైర్లు వేస్తూనే , ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదు అని చెప్పారు. ఇక తాజాగా వాసాలమర్రి గ్రామసభలో సీఎం కేసీఆర్‌ మరోసారి తనలోని కవిని బయటకి తీసుకువచ్చారు. సభ ప్రారంభం అయ్యాక సీఎం మాట్లాడం మొదలుపెట్టారు ... అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అనగానే గ్రామస్తులు ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగించారు , అలాగే ఈలలు కూడా వేశారు. దీనితో .. ఆపండయ్య నేనేమైనా సినిమా యాక్టర్ నా ఈలలు వేస్తున్నారు అనే సరికి దెబ్బకి అందరూ షాక్ అవుతూ సైలెంట్ అయ్యారు.

ఆ తర్వాత కాసేపటికి పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వచ్చిండంటే ఊరికి చాలా పనులు జరుగుతయి. పెద్ద మనిషికి చప్పట్లు కొట్టండి. ’ అని సీఎం అనేసరికి ఒక్కసారిగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. తర్వాత వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ గా ఉన్న పమేలా సత్పతిని యాదాద్రి జిల్లాకు కలెక్టర్‌ గా వేశాం. ఆమె అక్కడ బాగా పనిచేశారు.దీనితో ఆమెను వరంగల్‌ నుంచి తీయవద్దని నాతో కొందరు గొడవపడ్డారు. ఇప్పుడు ఆమెను మీ గ్రామ ప్రత్యేకాధికారిగా నియ మిస్తున్నా.. ఇక నుంచి తల్లి అయినా.. తండ్రి అయినా ఆమెనే అని కేసీఆర్‌ అన్నప్పుడు చప్పట్ల వర్షం కురిసింది. ఇది చూసిన కేసీఆర్‌.. మీ కలెక్టర్‌ కు చప్పట్లు బాగా కొడుతున్నరుగా అనడంతో అందరూ కేసీఆర్ సమసస్ఫూర్తికి నవ్వుకున్నారు. సీఎం కేసీఆర్‌ గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. కేసీఆర్‌ భోజనం చేస్తూ వారితో మాట్లాడారు.