Begin typing your search above and press return to search.

కేంద్రానికి ఇచ్చే లెక్కలు చెప్పే వేళ.. మన సంగతి ఏంది కేసీఆర్?

By:  Tupaki Desk   |   9 Oct 2021 7:39 AM GMT
కేంద్రానికి ఇచ్చే లెక్కలు చెప్పే వేళ.. మన సంగతి ఏంది కేసీఆర్?
X
మొదట్నించి వచ్చిన అలవాటు ఉత్తినే పోదు. విపక్ష నేతగా ఉన్నా.. ముఖ్యమంత్రిగా ఉన్నా.. తనకు అలవాటైన తీరులో విమర్శల్ని సంధించే అలవాటును మాత్రం మిస్ కావటం లేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రంతో అన్ని బాగున్నప్పుడు విమర్శలు చేయని ఆయన కాస్త తేడా వచ్చిన లెక్కల డొక్కల్లోకి వెళ్లిపోతుంటారు. తాజాగా అలాంటి తీరునే మరోసారి ప్రదర్శించారు. కేసీఆర్ నోటి నుంచి ఏ లెక్కలు అయితే వచ్చాయో.. ఏ రీతిలో తన వాదనను వినిపించారో.. మరి.. అదే వాదనను ఆయనకు ప్రశ్నిస్తే? వచ్చే సమాధానం ఏమిటి? అన్నదిప్పుడు చర్చగా మారింది.

కేంద్రమే అప్పుల ఊబిలో ఉన్నదని.. తెలంగాణకు ఏమిస్తదని పెదవి విరిచినప కేసీఆర్.. కేంద్రానికి మనకన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. తన అప్పుల గురించి ప్రశ్నించినప్పుడు.. ఆ మాటల్ని ఆయన ఎలా సమర్ధించుకుంటారో తెలిసిందే. ఇదిలా ఉంటే.. పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రాష్టం ఇచ్చిన మొత్తాన్ని.. దానికి బదులుగా రాష్ట్రానికి వచ్చిన లెక్కను చెప్పటం ద్వారా.. కేంద్ర ప్రభుత్వాన్ని సాకుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా వ్యాఖ్యానించారు.

గడిచిన ఏడేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చింది రూ.42 కోట్లు అయితే.. తెలంగాణ నుంచి వెళ్లిన మొత్తం రే.2.74 లక్షలుగా పేర్కొన్నారు. ఈ మాటలు విన్నంతనే తెలంగాణకు ఏదో అన్యాయం జరిగందన్న భావన కలగటం ఖాయం. కానీ.. విషయాన్ని లోతుల్లోకి వెళ్లినప్పుడు.. పస ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణ నుంచి అధిక మొత్తంలో ఆదాయం వెళితే.. కేంద్రం నుంచి చాలా తక్కువగా నిధులు వస్తున్నట్లుగా చెప్పిన కేసీఆర్.. తన రాష్ట్రం గురించి.. తాను అసురించే విధానాల్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేది హైదరాబాద్ మహానగరం.. మరి.. ఆ పన్ను ఆదాయంలో ఎంత మొత్తాన్ని హైదరాబాద్ మహానగరానికి ఖర్చు చేసి.. మిగిలిన జిల్లాలకు ఎంత ఖర్చు పెడుతున్నారన్నది ప్రశ్న. లెక్క అంటే లెక్క అన్నట్లే ఉండాలి. కేంద్రానికి ఒక లెక్క.. రాష్ట్రానికి మరో లెక్క అన్నట్లు ఉండకూడదు. కేంద్రాన్ని అడిగిన ప్రశ్నను.. తనకు తాను వేసుకుంటే కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు?తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తోంది హైదరాబాద్ మహానగరమే.. అలా అని.. నగరానికే మొత్తం నిధుల్ని ఖర్చుచేస్తే..మిగిలిన రాష్ట్రం మాటేమిటి? అన్నది అసలు ప్రశ్న. రాజకీయం కోసం కొన్ని ప్రశ్నల్ని సంధించటం బాగానే ఉన్నా.. మరీ లోతుల్లోకి వెళ్లకూడదన్న సత్యాన్ని కేసీఆర్ గుర్తిస్తారంటారా?