Begin typing your search above and press return to search.
గులాబీ బాస్ హస్తిన కు అంత త్వరపడి వెళ్లింది అందుకేనా?
By: Tupaki Desk | 15 Dec 2020 10:00 AM ISTదేశ రాజధాని శివారులో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా.. దేశ వ్యాప్త బంద్ కు పిలుపునిస్తే.. పలు రాష్ట్రాలు కూడా వాటిని పాటించాయి. ఆ మాట అనే బదులు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా భారత్ బంద్ ను చేశాయి. విపక్షం పిలుపునిచ్చే బంద్ కు.. అధికారపక్షం ఆమోదముద్ర వేసే భారత్ బంద్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటన్నది తెలుగు ప్రజలు చూసే భాగ్యం దక్కింది. ఇది జరిగిన 72 గంటల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. హుటాహుటిన ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు.
ప్రధాని మోడీతో సహా అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కావాలన్న ఆయన నిర్ణయానికి తగినట్లుగా ఏర్పాట్లు జరిగిపోయాయి. గతంలో మాదిరి ప్రధాని అపాయింట్ మెంట్ అడగటం.. అది రాకపోవటం లాంటివి చోటు చేసుకోకుండా కేసీఆర్ అడిగినంతనే ఆయనకు టైమిచ్చేయటం ఆసక్తికరంగా మారింది. మూడురోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన కేసీఆర్.. అసలు హస్తినకు ఎందుకు వెళ్లారన్నది ఆసక్తికర చర్చగా మారింది.
టీఆర్ఎస్ వర్గాల అంచనా ప్రకారం.. కేసీఆర్ ఢిల్లీ టూర్ ఆద్యంతం వ్యూహాత్మకంగా చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల అనంతరం.. ముఖ్యమంత్రికి నిఘా వర్గాలు ఒక నివేదికను అందజేసినట్లుగా సమాచారం. దాని ప్రకారం పలువురు టీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి జంప్ అయ్యేందుకు వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలిసింది. ఒకసారి వలసలు షురూ అయితే ఆపటం కష్టమన్న విషయం కేసీఆర్ కు తెలియంది కాదు. అందుకే.. వాటికి చెక్ పెట్టేలా.. ఢిల్లీ టూర్ చేశారని చెబుతున్నారు.
ప్రధాని మోడీని.. అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రుల్ని కలవటం ద్వారా.. ఢిల్లీలోని కేంద్రానికి.. రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య దూరం లేదని.. వారితోతనకు టర్మ్స్ బాగానే ఉన్నాయన్న సందేశాన్ని ఇవ్వటం లక్ష్యమని చెబుతున్నారు. బీజేపీలోకి వలసల్ని అడ్డుకట్ట వేసేందుకు వేసిన తొలి ఎత్తు ఢిల్లీ టూర్ గా చెబుతున్నారు. కేసీఆర్ అంచనాకు తగ్గట్లే.. ఢిల్లీ టూర్ తో ఆయన ఆశించిందే జరిగిందని.. గులాబీ నేతలు పలువురు బీజేపీలోకి వెళ్లే విషయంలో పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.