Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక అసలు లక్ష్యమిదా?
By: Tupaki Desk | 14 Dec 2020 2:00 PM ISTఎవరి విషయంలో ఎప్పుడు ఎలా వ్యవహరించాలన్న అంశంపై ప్రధాని మోడీతో పాటు.. కేంద్రమంత్రి అమిత్ షాకు స్పష్టమైన అంచనా ఉంటుందని చెబుతారు. అన్నింటికి మించి భారీ సమాచారం వారికి ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. ఇందుకు తగినట్లుగా వారు వ్యూహాల్నిసిద్ధం చేస్తుంటారు. తాజాగా రెండు ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి.
తనను కలవటానికి వచ్చే వారిలో చాలామందితో భేటీ అయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దగా పట్టించుకోరు. ఆ మాటకు వస్తే.. తనకు బదులుగా తన కుమారుడు కేటీఆర్ ను కలవాల్సిందిగా చెబుతారు. అదే సమయంలో.. ఢిల్లీలోని ప్రధాని మోడీకి సైతం విచిత్రమైన అలవాటు ఉంది. ఆయన ఎప్పుడు ఎవరికి టైం ఇస్తారో? అన్నది ప్రశ్న. ఆ మాటకు వస్తే.. రాష్ట్ర ముఖ్యమంత్రులు పలువురితో భేటీ అయ్యేందుకు ఆయన అస్సలు ఇష్టపడరు. చాలాసార్లు రాష్ట్ర సీఎంలు కలుస్తామని టైం అడిగితే.. నో చెప్పేయటం ఈ మధ్యన చూస్తున్నదే.
అలాంటి రెండు వైరుధ్యాలు ఉన్న కీలకనేతలు తాజాగా భేటీ కావటం గమనార్హం. ఆ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీని కలిసేందుకు టైం అడిగితే.. సాధ్యం కాదని చెప్పారు. అందుకు భిన్నంగా ఈసారి ప్రధానితో భేటీ అన్నంతనే ఓకే చెప్పేశారు. ఆ వెంటనే కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లటం.. అక్కడ ఆయన కోరుకున్నట్లే అపాయింట్ మెంట్ ఇవ్వట జరిగిపోయాయి. అయితే.. కేసీఆర్ ఢిల్లీ టూర్ మొత్తం తాను అనుకున్నట్లే జరిగిందని భావిస్తున్నా.. అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు టైం అడగటం ద్వారా కేసీఆర్ ప్లాన్ వేరే ఉందని చెబుతున్నారు. తాను టైం అడగటం.. కేంద్రం ఇవ్వకపోవటం లాంటివి చోటు చేసుకుంటే.. దాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వినియోగించుకోవాలన్న ఎత్తుగడలో గులాబీ బాస్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం తమ మీద మరక అంటుకోకుండా ఉండేందుకు టైమిచ్చినట్లుగా తెలుస్తోంది. గతానికి భిన్నంగా టీఆర్ఎస్ ఎత్తుల్ని ఎప్పటికప్పుడు చిత్తు చేసేందుకు వీలుగా బీజేపీ అధినాయకత్వం అంతర్గతంగా ఒక కార్యాచరణను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ కోరినంతనే.. అపాయింట్ మెంట్ ఇవ్వటం జరిగినట్లుగా సమాచారం. ఎవరి లెక్కలు వారు వేసుకొని.. ఎవరి ఎత్తులు వారు సిద్దం చేసుకొని జరిగిన భేటీగా చెబుతున్నారు.