Begin typing your search above and press return to search.

హస్తినకి సీఎం కేసీఆర్ ... మూడు రోజుల మకాం , మోడీతో భేటీ ఉంటుందా !

By:  Tupaki Desk   |   10 Dec 2020 11:35 AM IST
హస్తినకి సీఎం కేసీఆర్ ... మూడు రోజుల మకాం , మోడీతో భేటీ ఉంటుందా !
X
తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీ పర్యటన లో బిజీగా ఉండబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎంవో, ప్రధాని మోడీ అపాయింట్‌ మెంట్‌ కోరినట్లు తెలుస్తుంది. మోడీ అపాయింట్‌ మెంట్‌ ఖరారైతే, మోదీ, కేసీఆర్ మధ్య భేటీ ఉండే అవకాశం ఉంది. అయితే తెలంగాణ లో దుబ్బాక లో జరిగిన ఉప ఎన్నిక , అలాగే గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ , బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. ఏకంగా ప్రధాని మోడీని టార్గెట్ చేసుకొని విమర్శలు కురిపించారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరడం ఆసక్తిగా మారింది.

ఈ పర్యటన లో సీఎం కేసీఆర్ , ప్రధాని మోడీ తో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌, మరికొందరు కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది.. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధుల విషయాన్ని ప్రస్తావించనున్నారు. మరోవైపు.. దేశరాజధానిలోనూ పార్టీ కార్యాలయ నిర్మాణం కూడా చేపట్టనుంది టీఆర్ఎస్. ఈ పర్యటనలో ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. అయితే కేసీఆర్ వ్యవహారం తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. వర్చువల్ ద్వారా జరిగే కొత్త పార్లమెంట్ శంకుస్థాపనకు హాజరవుతానని లేఖలో కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మోదీకి కేసీఆర్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.