Begin typing your search above and press return to search.

కనుమరుగు కానున్న ‘కలెక్టర్’ హోదా

By:  Tupaki Desk   |   28 Aug 2020 4:00 PM IST
కనుమరుగు కానున్న ‘కలెక్టర్’ హోదా
X
తెలంగాణ సీఎం కేసీఆర్ సంస్కరణల బాట పట్టారు. ఇప్పటికే రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాలని భావిస్తున్న కేసీఆర్.. అవినీతికి నిలయమైన వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలనే ఎత్తివేస్తున్నారు. ఈ క్రమంలోనే మొత్తం రెవెన్యూ శాఖలో ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.

ఇక సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావలని నిర్ణయించారు. అధికారుల హోదాలో కూడా మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ పేరు ఇకపై జిల్లా మేజిస్ట్రేట్ గా మార్చాలని.. కలెక్టర్ అనే పదాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాలో ఈ అంశాన్ని చేర్చే విధంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

‘కలెక్టర్’ పదం.. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే అధికారిగా బ్రిటీష్ వారు పెట్టారు. కానీ ఆ పాతపేరు ఐఏఎస్ లకు అపవాదు అని కేసీఆర్ భావించి ఇలా పేరు మారుస్తున్నట్టు తెలుస్తోంది.