Begin typing your search above and press return to search.
మేడారం మీద మీ మాటలన్ని నీళ్ల మీద రాతలేనా సారూ?
By: Tupaki Desk | 6 Feb 2020 11:28 AM ISTమాటలు కోటలు దాటతాయి. చేతలు అడుగు కూడా ముందుకు పడదు. ఈ సిత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో తరచూ కనిపిస్తుంటుంది. విషయం ఏదైనా తనదైన శైలిలో చెప్పుకుంటూ పోతారు. ఏదైనా పని తాను అనుకుంటే పూర్తి చేస్తానని చెప్పే క్రమంలో ఆయన కొన్ని మాటల్ని తరచూ ప్రస్తావిస్తుంటారు. అది ప్రాజెక్టు అయినా పంచాయితీ అయినా.. కుర్చీ వేసుకొని కూర్చొని మరీ ఆ సంగతి తేలుస్తానని చెబుతారు. కానీ.. ఇప్పటి వరకూ అలా ఒక్కసారి కూడా చేసింది లేదు.
రెండేళ్లకోమారు సాగే మేడారం జాతరకు సంబంధించి కేసీఆర్ ఇలాంటి మాటలే చెప్పారు. తాను చెప్పిన మాటల్ని ఉమ్మడి రాష్ట్రంలో మరే ముఖ్యమంత్రి అయినా చెప్పి.. తన మాదిరి అవేమీ చేయకుండా ఉండి ఉంటే ఆయన నిప్పులు చెరిగేవారు. ఆత్మ గౌరవాన్ని.. అంతకు మించిన భావోద్వేగాన్ని బయటకు తీసేవారు. తెలంగాణ వాళ్లమనేగా.. ఈ చిన్నచూపు. అదే మా రాష్ట్రంలో.. మా పాలనలో అయితే ఇలా జరిగేదా? అని పాయింట్ లాగేవారు.
కానీ.. కేసీఆర్ మాదిరి క్వశ్చన్లు వేసే వారు తెలంగాణ రాష్ట్రంలో మరెవరూ లేరు. దీంతో.. ప్రశ్నించే ప్రతిపక్షం లేనప్పుడు అధికారపక్షానికి ఎంత హాయిగా ఉంటుందో తాజా పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. మేడారం జాతరను జాతీయ హోదా తీసుకొస్తానని.. ప్రపంచమంతా అబ్బుపడేలా గొప్పగా చేసుకుందామని.. జాతరను డెవలప్ చేయటానికి రూ.200 కోట్లు ఇస్తానని.. 200 ఎకరాలు భూసేకరణ చేసి నభూతో.. అన్న రీతిలో చేస్తానని కోతలు కోశారు.
రెండేళ్ల క్రితం మేడారం జాతరకు వచ్చిన సందర్భంగా కేసీఆర్ నోటి నుంచి వచ్చిన పలు వరాలు నేటికి అమలుకు నోచుకోలేదు. జాతర అయిపోయిన వెంటనే తాను స్వయంగా మేడారం వచ్చి.. కుర్చీ వేసుకొని కూర్చొని మరీ భూసేకరణ కోసం సర్వే చేయిస్తానని మాటిచ్చిన వైనాన్ని మర్చిపోయి ఉంటారు. సాధారణంగా కుర్చీ వేసుకొని కూర్చొని తానే పర్సనల్ గా చేస్తానని మాటల్లో అదరగొట్టేసిన కేసీఆర్.. మళ్లీ మేడారం జాతర వచ్చేసిన తర్వాత కూడా ఆయన చెప్పిన పనుల్లో ఒక్కటి కూడా పూర్తి కాలేదు. సొంత రాష్ట్రంలో తన చేతిలోనే పవర్లు అన్ని పూర్తిగా ఉన్న వేళ.. రెండేళ్లలో 200 కోట్ల రూపాయిలు కూడా కేటాయించ లేకపోవటాన్ని ఏమనాలి సారూ?