Begin typing your search above and press return to search.
నివర్ తుఫాన్ ... ఆ మూడు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే !
By: Tupaki Desk | 28 Nov 2020 6:40 PM ISTనివర్ తుఫాన్ ప్రభావం కారణంగా తమిళనాడు, ఏపీలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఏపీలోని కడప ,చిత్తూరు , నెల్లూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికీ ఆ జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. దీనితో వరద ప్రభావిత ప్రాంతాలను ఈ రోజు సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. చిత్తూరు జిల్లాలో నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడ పలువురు రాష్టమంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు.
సీఎం జగన్ అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష చేపట్టారు. తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టాలపై చర్చిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు నివేదికలతో సహా సమావేశానికి హాజరు అయ్యారు. ఈ భేటీలో వరద నష్టాలను ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తేనున్నారు.
అనంతరం సీఎం తాడేపల్లికి తిరుగు పయనమవుతారు. కాగా, తుపాను ప్రభావంతో శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తినష్టం, పంటనష్టం అంచనాలను పూర్తి చేసి డిసెంబర్ చివరిలోగా బాధితులకు పరిహారం అందించాలని నిన్న కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలను కేంద్రానికి కూడా పంపనున్నారు.