Begin typing your search above and press return to search.
మీరే రేపటి నవ సమాజ నిర్ణేతలు : సీఎం జగన్ !
By: Tupaki Desk | 14 Nov 2020 5:40 PM ISTఈ రోజు నవంబర్ 14 ... బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి అని ఆయన అన్నారు. నేడు ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి. తల్లిదండ్రుల ఆశలకు ప్రతి రూపాలు వారు. ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువొక్కటే. అందుకే చిన్నారుల భవిష్యత్తుని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అని తెలియజేసారు.
మరోవైపు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపారు జగన్. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని భగవంతున్ని కోరుకుంటున్నా అని జగన్ ట్వీట్ చేశారు.
నేటి బాలలే రేపటి పౌరులు . వారే దేశ భవిష్యత్తుకు పునాదులు. వారి భవిష్యత్తును విస్మరిస్తే కలిగే దుష్పరిణామాలను ప్రపంచమంతా ఎప్పుడో గుర్తించింది. అందుకే వారి చదువు, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు.మన దేశంలో కూడ స్వాతంత్ర్యం వచ్చాక 1956 వరకు నవంబరు 20 నే బాలల దినోత్సవం నిర్వహించేవారు. అయితే మన దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. ఆయన ఎర్ర గులాబీలను ఎంతగా ప్రేమించేవారో అంతగా పిల్లలంటే ఇష్టపడేవారు. అందుకే ఆయన మన దేశ చిన్నారులందరికీ తాత అయ్యారు. చాచా నెహ్రూగా ప్రసిద్ధి కెక్కారు. దీంతో ఆయన దివంగతుడైన 1964 నుంచి ఆయన పుట్టిన రోజైన నవంబరు14 న మనం బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము.