Begin typing your search above and press return to search.

కోర్టును ఆశ్ర‌యించిన సీఎం జ‌గ‌న్‌.. రీజ‌న్ ఇదే

By:  Tupaki Desk   |   29 March 2022 5:30 PM GMT
కోర్టును ఆశ్ర‌యించిన సీఎం జ‌గ‌న్‌.. రీజ‌న్ ఇదే
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌.. కోర్టును ఆశ్ర‌యించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు కొట్టివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2014లో హుజూర్‌నగర్‌లో నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారన్న అభియోగం మేరకు జగన్‌పై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసుపై నిన్న(సోమవారం) నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపింది.

జగన్కు ఇంకా సమన్లు ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా.. ఈనెల 31 లోగా జగన్కు సమన్లు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్వాష్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌మూర్తి.. జగన్ హాజరుపై న్యాయస్థానం ఏప్రిల్ 26 వరకు స్టే విధించారు.

ఏం జ‌రిగిందంటే..

తెలంగాణలోని హుజూర్నగర్లో జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసుపై.. గ‌త రెండురోజులుగా నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. 2014లో అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారన్న అభియోగం మేరకు జగన్‌పై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జగన్ నేరుగా కోర్టుకు హాజ‌రు కావాలంటూ.. స‌మ‌న్లు జారీ చేసింది. దీని ప్ర‌కారం .. సోమ‌వారం సీఎం జ‌గ‌న్ హాజ‌రు కావాలి. కానీ, ఇంకా సమన్లు ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 31లోగా జగన్కు సమన్లు అందించాలని టీఎస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంత‌లోనే జ‌గ‌న్‌.. త‌న‌పై న‌మోదైన కేసును కొట్టివేయాల‌ని కోరుతూ.. కోర్టుకు వెళ్లారు. దీంతో స్టే విధించారు. ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న గున్నం నాగిరెడ్డి కరోనాతో మరణించినట్లు పీపీ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. నాగిరెడ్డి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మూడో నిందితుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఐదు వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం శ్రీకాంత్ రెడ్డిని ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.