Begin typing your search above and press return to search.

పాదయాత్ర వర్సెస్ పల్లె నిద్ర... కొత్త కాన్సెప్ట్ తో జగన్

By:  Tupaki Desk   |   7 Feb 2023 11:00 PM GMT
పాదయాత్ర వర్సెస్ పల్లె నిద్ర...  కొత్త కాన్సెప్ట్ తో జగన్
X
ఏపీలో రాజకీయాల మధ్య పోటీ పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీ పాదయాత్రను స్టార్ట్ చేయించింది. పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సిద్ధపడుతున్నారు. చంద్రబాబు జిల్లా టూర్లు అంటున్నారు. ఇక బాకీ ఉన్నది అధికార వైసీపీ మాత్రమే. అందుకే జగన్ ఇపుడు రంగంలోకి దిగిపోతున్నారు. ఆయన కొత్త కాన్సెప్ట్ తో రెడీ అవడమే ఇక్కడ మ్యాటర్ అంటే.

నిజానికి పాదయాత్ర రెండు దశాబ్దాల క్రిత్రం నాటి కాన్సెప్టు అది ఈ రోజున పాతబడిపోయింది. పాదయాత్రను ఆధారంగా ఆయుధంగా చేసుకుని ముగ్గురు సీఎంలు అయ్యారు. వైఎస్సార్ పాదయాత్రను స్టార్ట్ చేస్తే జనాలు తాముగా తరలివచ్చారు. చంద్రబాబు నాటికి కాస్తా పార్టీ జనాలు ఎక్కువ అయ్యారు. జగన్ పాదయాత్రలో పార్టీ అతి పెద్ద కొమ్ము కాసింది. ఇక లోకేష్ పాదయాత్ర చేస్తూంటే పార్టీ జనాలకు కూడా ఇంకా కనెక్ట్ కావాల్సి ఉంది అని అంటున్నారు.

పాదయాత్రలకు ఓట్లు రాలే రోజులు పోయాయని అంటున్నారు. ఎందుకంటే కొత్త ఒక వింత పాత ఒక రోత. అలా చూసుకుంటే పాదయాత్ర నేతలు చేయడం ఓట్ల కోసమే తప్ప మరేమీ కాదని జనాలకు పూర్తిగా అర్ధం అవుతున్న పరిస్థితి ఉంది. పాదయాత్ర విషయంలో జనాలు పెద్దగా ప్రభావితం అయ్యే రోజులు కావని మేధావులు అంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా పాదయాత్ర చివరి ఫలితం అందుకున్నది జగన్ మాత్రమే అనేశారంటే ఆలోచించాల్సిందే. దాంతో పాదయాత్ర చూసేసిన సినిమాగా ఉంది. బస్సు యాత్ర అంటే ఎన్టీయార్ చైతన్య రధం మీద నాలుగు దశాబ్దాల క్రితమే వచ్చి జనాలను సమ్మోహనం చేశారు.

దాంతో జగన్ ఇపుడు సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. అదే పల్లె నిద్ర. ఇది నాయకులు కొందరు అపుడపుడు చేసినది తప్ప ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్త్రి తమ పల్లెకి వచ్చి రాత్రి అంతా నిద్ర చేయడం అంటే చాలా కొత్తగానే ఉంటుంది. సీఎం మా ఊళ్ళో ఉన్నారు అంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. ఇక సమస్యలు తాము చెప్పుకోవచ్చు అన్న ఆరాటం కూడా ఉంటుంది.

రాష్ట్రాన్ని ఏలే నాయకుడు తమ ఊరిలో తమతో పాటే బస చేస్తున్నారు అంటే ఆ ఇంటరెస్టే వేరుగా ఉంటుంది. దాంతో జగన్ బాగా ఆలోచించి ఈ కొత్త కాన్సెప్ట్ ని రెడీ చేశారు అని అంటున్నారు. కాన్సెప్ట్ వరకూ హిట్టే. ఇది కనుక జనాలకు కనెక్ట్ అయితే మాత్రం పాదయాత్రలు బస్సు యాత్రలకు పక్కన పెట్టి దీని మీదనే డిస్కషన్ ఒక లెవెల్ లో ఉంటుంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే జగన్ వచ్చే పల్లెలు ఎలా ఉన్నాయి. అక్కడ జనాల సమస్యలు ఎలా ఉన్నాయి. వాటికి ప్రభుత్వం గత నాలుగేళ్లలో టచ్ చేసిందా పరిష్కారం చూపించిందా అన్నది కీలకమైన అంశం.

ఇక పల్లె జనాలు అంటే వారిలో అధికార పార్టీ సానుభూతిపరులే ఉండే పరిస్థితి ఉండదు, విపక్షాల మద్దతుదారులూ ఉంటారు. వారు వేసే ప్రశ్నలు ఏవైనా ప్రభుత్వం లెవెల్ లో సమాధానం చెప్పాలి. వారు సంధించే వాటికి కూడా తగిన జవాబు అధికారుల నుంచి తగిన జవాబు ఉండాలి. అపుడే ఈ పల్లె నిద్ర హిట్ అవుతుంది. ఆ విధంగా డిజైన్ చేసుకుంటేనే ఏపీలో జగన్ పేరు కానీ పల్లె నిద్ర కానీ మరో మారు మారుమోగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే జగన్ సడెన్ గా పల్లె నిద్ర అని ఎందుకు అంటున్నారు అని కూడా చర్చకు వస్తోంది. ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. విపక్షాలు అన్నీ రోడ్ల మీద ఉన్నాయి. వారు ఏమి మాట్లాడినా పదే పదే చెప్పే మాటలు కచ్చితంగా జనాలకు చేరుతాయి. అదే టైం లో అధికార పక్షం వైపు నుంచి పెద్దగా రియాక్షన్ లేకపోతే విపక్షం త్రాసే మొగ్గు చూపుతుంది. అలా అనుకోని డ్యామేజి జరిగే అవకాశం ఉంది అని పసిగట్టే జగన్ పల్లె నిద్ర అంటున్నారు అని చెబుతున్నారు.

ఇక జగన్ సీఎం హోదాలో వచ్చి పల్లెలలో నిద్ర చేస్తే నిద్రపోయిన చాలా నిజాలు బయటకు వస్తాయని అంటున్నారు. ఇప్పటిదాకా చేసిన సర్వేలు ఒక ఎత్తు. గ్రౌండ్ లెవెల్ లో రియాల్టీస్ ఏంటి అన్నవి సీఎం కి స్వయంగా ఈ పల్లె నిద్ర ద్వారా అర్ధం అవుతుంది అని అంటున్నారు. ఇక తమ పార్టీకి చెందిన నాయకులు నిద్రను లేపడానికే జగన్ పల్లె నిద్ర అంటున్నారు అని కూడా తెలుస్తున్న విషయం. నాయకులు అంతా బాగుంది అనుకుంటూ చెప్పుకుపోతున్నారు కానీ లోగుట్టు తెలుసుకోవాలంటే జగన్ పల్లెలలో విడిది చేస్తేనే వాస్తవాలు అర్ధమవుతాయని అంటున్నారు. సో జగన్ పల్లె నిద్ర ప్రత్యర్ధి పార్టీలకు నిద్ర లేకుండా చేయడానికి సొంత పార్టీ వారిని నిద్ర లేపడానికి అని


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.