Begin typing your search above and press return to search.

నాడు- నేడు పై సీఎం జగన్ కీలక నిర్ణయం ...ఏమిటంటే ?

By:  Tupaki Desk   |   12 Nov 2019 10:38 AM GMT
నాడు- నేడు పై సీఎం జగన్ కీలక నిర్ణయం ...ఏమిటంటే ?
X
గత కొన్ని రోజులు గా రాష్ట్రం లో ఇంకేం సమస్యలే లేనట్టు గా ప్రతిపక్షం టీడీపీ , జనసేన , ఇతర పార్టీలు అన్ని కూడా స్కూల్స్ పై పడ్డాయి. సీఎం జగన్ పేద , మధ్య తరగతి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలనే లక్ష్యం తో ప్రభుత్వ పాఠశాల లో వచ్చే ఏడాది నుండి ఇంగ్లీష్ మీడియం ని ప్రవేశ పెట్టబోతున్నట్టు తెలిపారు.పేద , మధ్య తరగతి ప్రజలు సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తుంటే.. ప్రతి పక్షాలు మాత్రం జగన్ పై విమర్శలు కురిపిస్తున్నారు. రాష్ట్రం లో తెలుగు లేకుండా చేయడమే సీఎం జగన్ లక్ష్యమా అంటూ విమర్శల దాడి చేస్తున్నారు. దీనికి సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఈ రోజు స్పందన కార్యక్రమం పై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నవంబర్‌ 14న నాడు- నేడు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. నాడు- నేడు కార్యక్రమాన్ని కలెక్టర్లు ప్రతిష్టాత్మకం గా తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మన విద్యార్థులు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షలు రాసే స్థాయికి చేరు కోవాలని అన్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయినా కూడా తెలుగు సబ్జెక్టు తప్పని సరిగా ఉండాలి అని తెలియజేసారు.

ఇక ఈ నాడు - నేడు కార్యక్రమం లో భాగంగా .. మొదటి దశ లో 15 వేలకు పైగా పాఠశాల ల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిషు మీడియం లో బోధన ఉంటుందన్నారు. ఆ తర్వాత ఒక్కో ఏడాది తదుపరి తరగతుల్లో ఇంగ్లీషు విద్యా బోధన ప్రవేశ పెడతామని తెలిపారు. జనవరి 1 నుంచి టీచర్ల కు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. స్కూళ్ల లో ఇంగ్లిషు ల్యాబ్స్‌ కూడా ఉండాలి. టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్‌ పనులు, మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, హై స్కూల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం.. ఇవన్నీ నాడు- నేడు కార్యక్రమం లో భాగమే అని సీఎం జగన్ తెలిపారు.