Begin typing your search above and press return to search.

నిజాలు ప్రజలకి తెలిసేలా .. బ్లాక్‌ బోర్టులు పెట్టండి : సీఎం జగన్

By:  Tupaki Desk   |   31 July 2020 1:35 PM GMT
నిజాలు ప్రజలకి తెలిసేలా .. బ్లాక్‌ బోర్టులు పెట్టండి : సీఎం జగన్
X
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా రికార్డ్ స్థాయిలో పది వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటికే ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,30,557కి చేరింది. అలాగే , మొత్తం ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1281కి చేరింది. ఈ నేపథ్యంలో కరోనా నివారణా చర్యల్లో భాగంగా శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జగన్ మొట్లాడుతూ .. బెడ్లు దొరకలేదనే పరిస్థితి ఉండకూడదు. హెల్ప్ ‌డెస్క్‌ ల్లో ఆరోగ్య మిత్రలను ఉంచాలి. కరోనా‌ కోసం నిర్దేశించిన138 ఆస్పత్రుల యాజమాన్యంపై దృష్టిపెట్టండి. సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. హెల్ప్‌డెస్క్‌లో ఉన్నవారికి ఓరియంటేషన్‌ బాగుండాలి. హెల్ప్‌ డెస్క్‌ ప్రభావవంతంగా పనిచేస్తే.. చాలావరకు సమస్యలు తగ్గుతాయి. బెడ్లు, వైద్యం, ఫుడ్, శానిటేషన్‌ బాగుందా లేదా అన్నదానిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. జీజీహెచ్‌ లాంటి ఆస్పత్రులపై మరింత శ్రద్ధపెట్టాలి. సమర్థవంతమైన సిబ్బందిని పెట్టాలి. జేసీలు దీనిపై ఫోకస్‌ పెట్టాలి. ఆస్పత్రుల మేనేజ్‌మెంట్‌పై బాగా దృష్టి పెట్టండి.

కాల్‌ సెంటర్స్‌ సరిగ్గా పనిచేస్తున్నాయా.. లేదా.. చూడండి. వచ్చే కొన్ని రోజులు దీనిపై శ్రద్ధ వహించండి. కరోనా‌ పై అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారం చేపట్టండి. స్వప్రయోజనాల కోసం తప్పుడు వార్తాకథనాలు ఇస్తే ఎప్పటికప్పుడు ఖండించాలి. లేదంటే ప్రజలు వీటిని వాస్తవం అనుకునే అవకాశం ఉంది. నిజాలు ప్రజలముందు పెట్టండి. వచ్చే సమాచారంలో వాస్తవాలు ఉంటే.. వాటిని పాజిటివ్ ‌గా తీసుకుని సమస్యలను పరిష్కరించండి అని సీఎం తెలిపారు. ప్లాస్మా థెరపీపై కూడా బాగా అవగాహన కల్పించాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సాహించాలి. ప్లాస్మా ఇచ్చేవారికి 5వేల రూపాయలు ఇవ్వండి. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుంది అని అన్నారు. అలాగే ప్రతి కరోనా హాస్పిటల్ లో బ్లాక్‌ బోర్డు పెట్టి.. అక్కడి బెడ్ల ఖాళీ, భర్తీ వివరాలను అందులో రాయాలని ఆదేశించారు.