Begin typing your search above and press return to search.
వరదలపై సీఎం జగన్ సమీక్ష..బాధితులకు రూ.2వేల సాయం
By: Tupaki Desk | 18 Aug 2020 5:20 PM ISTఏపీలో వరదల పరిస్థితులపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. నిర్వాసితులపై ఆరా తీశారు. గోదావరి వరద ఉధృతికి ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నష్టం చోటుచేసుకున్న దృష్ట్యా ఆయా జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ఇక ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కంటికి రూ.2వేల చొప్పున సహాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో.. ఉదారంగా వ్యవహరించాలని కోరారు. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని.. ఖర్చు విషయంలో రాజీ పడొద్దని సూచించారు.
వరద తగ్గుముఖం పట్టగానే 10రోజుల్లో పంటనష్టం అంచనాలు పంపించాలని.. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను పునరుద్దరించాలని జగన్ ఆదేశించారు.
తూర్పు గోదావరి జిల్లాలో 95 క్యాంప్ లలో 14477మందికి వసతి కల్పించామని అధికారులు సీఎంకు విన్నవించారు. పశ్చిమ గోదావరిలో 26 శిబిరాల్లో 5వేల మంది వసతి కల్పించామని తెలిపారు.
వరద తగ్గగానే 10రోజుల్లో పంట నష్టం అంచనావేసి సాయం చేయాలని.. వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్దరించాలని సీఎం ఆదేశించారు.