Begin typing your search above and press return to search.

బాహుబలి గ్రాఫిక్స్ చూపించలేనంటున్న సీఎం జగన్!

By:  Tupaki Desk   |   5 Feb 2020 2:22 PM IST
బాహుబలి గ్రాఫిక్స్ చూపించలేనంటున్న సీఎం జగన్!
X
ఏపీ రాజధానుల వ్యవహారం పై సీఎం జగన్ మరోసారి స్పందించారు. అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం అయితే మరో ఉద్యమం తప్పదు అని ..అందుకే అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే మూడు రాజధానుల ప్రకటన చేసినట్టు తెలిపారు. వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మరోసారి స్పష్టం చేసారు. అలాగే అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా కొనసాగుతుందని, అలాగే అమరావతి లో కూడా అభివృద్ధి కొనసాగుతుందన్నారు. అమరావతి తో పాటుగా విశాఖ ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్‌గా ఉంటుందని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి లో రాజధాని నిర్మాణానికి దాదాపుగా రూ.1.09లక్షల కోట్లు కావాలని, అలాగే కీలక మౌలిక సదుపాయాలకు ఎకరాకు రూ.2కోట్లు అవుతుందని సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇంత ఖర్చు తో అమరావతి లో రాజధాని నిర్మాణం కష్టం అవుతుందని, అమరావతికి చేసే ఖర్చులో కనీసం పది శాతం విశాఖ లో ఖర్చు చేస్తే, వచ్చే పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడే నగరంగా విశాఖ మారుతుంది అని , అప్పుడు ఉద్యోగాల కోసం యువత హైదరాబాద్ , బెంగుళూరు వంటి నగరాలకు పోవాల్సిన అవసరం ఉండదు అని తెలిపారు.

ఇదే సమయంలో పరోక్షంగా టీడీపీ కి చురకలు అంటించారు. రాజధానిపై తాము బాహుబలి గ్రాఫిక్స్ చూపించనని , సింగపూర్, జపాన్ తరహా నగరాలను సృష్టించేంత నిధులు మన దగ్గర లేవని తెలుసు కాబట్టి, ప్రజలకి లేనిపోనివి చూపించి మభ్యపెట్టి, మోసం చేయాల్సిన వసరం లేదు అని చెప్పారు. తాను ఎంత చేయగలుగుతానో ఆ వాస్తవాలను మాత్రమే చెప్పానని , ఇప్పటికిప్పుడు లక్ష కోట్లు ఖర్చు పెట్టలేకే రాజధాని వికేంద్రీకరణ చేస్తున్నామని వెల్లడించారు. అందుకే ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖకు రాజధానిని మారుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సచివాలయం, సీఎం ఆఫీస్, మంత్రులు, హెచ్‌వోడీలు విశాఖలోనే ఉంటాయని , తనకి ఏ ప్రాంతానికి అన్యాయం చేయాలని లేదని, అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని మరోసారి స్పష్టం చేసారు.