Begin typing your search above and press return to search.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు కదిలివస్తున్న జగన్

By:  Tupaki Desk   |   27 Nov 2020 11:17 PM IST
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు కదిలివస్తున్న జగన్
X
తీరం దాటిన ‘నివర్’ తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతాకాదు.. దక్షిణ ఆంధ్రపై ఈ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. వేల ఎకరాల్లో పంటను నేలకూల్చింది. తీర ప్రాంత బాధితులను సహాయక పునరావాస ప్రాంతాల్లో ఉంచారు. వారికి ఇప్పటికే వరద సాయం అందిస్తానని సీఎం జగన్ ప్రకటించారు.

ఈ క్రమంలోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ రేపు శనివారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్షించనున్నారు. నివర్ తుఫాన్ పై నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా సీఎం చర్చించారు.

దెబ్బతిన్న పంటలకు డిసెంబర్ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

తుఫాన్ ప్రభావంపై సీఎం వైఎస్ జగన్ నిన్న తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తుఫాన్ ప్రభావం, కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో కరెంట్ షాక్ తో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. వర్షాలు అనంతరం పంటనష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని.. భారీ వర్షాలు కారణంగా ఏదైనా నష్టం వస్తే సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చారు.