Begin typing your search above and press return to search.

షాతో జగన్ రెండో రౌండ్ భేటీ.. బాబుకు తిప్పలు తప్పవా?

By:  Tupaki Desk   |   23 Sept 2020 11:45 AM IST
షాతో జగన్ రెండో రౌండ్ భేటీ.. బాబుకు తిప్పలు తప్పవా?
X
కేంద్రంలో కీలకంగా.. ప్రధానమంత్రికి కళ్లు.. చెవులుగా వ్యవహరించే ప్రముఖుడు.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో రెండు రోజుల పాటు వరుస పెట్టి సమావేశం కావటం దేనికి సంకేతం? అందునా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి అధినేతతో.. అమిత్ షా రోజు తేడాతో మరోసారి భేటీ కావాలని డిసైడ్ కావటం చూస్తుంటే.. ఏపీ విపక్ష నేత చంద్ర బాబుకు మూడినట్లుగా పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం జరిగిన భేటీ పూర్తి కాకపోవటం.. ఈ రోజు ఉదయం (బుధవారం) తనను కలవాల్సిందిగా జగన్ ను అమిత్ షా కోరినట్లుగా తెలుస్తోంది. ఎందుకిలా? అసలేం జరిగింది? అన్నదిఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ క్యాంపు విశ్లేషణ ప్రకారం.. తన తాజా భేటీలో విపక్ష నేత చంద్రబాబు మీద చర్యలు తీసుకోవటానికి అవకాశం ఉన్న అంశాల్ని అమిత్ షా ముందు జగన్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

అమరావతి భూములు.. ఫైబర్ నెట్.. అంతర్వేది వ్యవహారాలపై సీబీఐ విచారణకు ఓకే చెప్పాలని.. కేంద్రం ఈ విషయాల్ని ప్రకటిస్తే.. బాబుకు భారీ ఎదురుదెబ్బ తప్పదన్న అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. దీనికి బలం చేకూరేలా.. అమిత్ షాతో భేటీ సందర్భంగా పీఎంవో ఉన్నతాధికారి కేకే మిశ్రాతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడటం ఈ వాదనకు బలం చేకూరేలా చేస్తోంది.

జగన్ వినతిపై కేంద్రం కొన్ని అంశాల్ని ప్రస్తావించిందని.. దానికి సమాధానాలు ఇవ్వటానికి.. సమాచారాన్ని అందించటానికి తనకు కాస్త సమయాన్ని ఇవ్వాలని సీఎం జగన్ కోరటంతో.. మంగళవారం భేటీ అసంపూర్ణంగా సాగినట్లుగా సమాచారం. మొత్తంగా చూస్తే.. బుధవారం రెండో దఫా షాతో సీఎం జగన్ భేటీ అంటే.. చంద్రబాబుకు కొత్త సమస్యలు ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.