Begin typing your search above and press return to search.

అసైన్డ భూములపై సీఎం జగన్ కీలక నిర్ణయం ... తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డు !

By:  Tupaki Desk   |   6 May 2021 10:01 AM GMT
అసైన్డ భూములపై సీఎం జగన్ కీలక నిర్ణయం ...  తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డు !
X
అసైన్డ్ భూములు ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది. హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా దేవరయాజల్ లో అసైన్డ్ భూములు కబ్జా చేశారనే ఆరోపణలతో మంత్రి పదవిని ఈటల రాజేందర్ కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ వివాదం మరో కీలక మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రిని పార్టీ నుండి బహిష్కరించే అవకాశం కూడా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. తెలంగాణాలో అసైన్డ భూముల యవ్వారం ఇలా ఉంటే .. ఏపీలో మాత్రం అసైన్డ్ భూములకు పరిహారాన్ని పదింతలు చేస్తూ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే .. ఏపీలో ఇప్పటినుండి ఎక్కడైనా తప్పనిసరిగా భూ సేకరణ చేయాల్సిన పరిస్థితులు వస్తే ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్‌ భూములకు భారీ ఎత్తున పరిహారం చెల్లించాల్సి వస్తుంది. సాగుభూములుగా రైత్వారీ పట్టా కలిగిన భూముల కంటే 10 శాతం అదనంగా అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. అసైన్డ్‌ భూములంటే ప్రభుత్వం పెత్తనం చేయకుండా భవిష్యత్తులో
వారిలో అన్యాయం జరగకుండా పేదలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయానికి కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల విషయంలో జాతీయ భూ సేకరణ చట్టం-2013లో పేర్కొన్న దానికంటే అధికంగా పరిహారం చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రైత్వారీ భూములతో సమానంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు పరిహారం చెల్లించాలని 2013నాటి జాతీయ భూసేకరణ చట్టం చెబుతుండగా, ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు రైత్వారీ పట్టాల కంటే 10 శాతం అధికంగా పరిహారం దక్కుతుంది.

నిజానికి ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం ఇవ్వాలని దివంగత సీఎం వైఎస్ 2007లోనే నిర్ణయించారని, ఆ స్ఫూర్తితోనే 2013 జాతీయ భూసేకరణ చట్టం వచ్చిందని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. అసైన్డ భూములకు రైత్వారీ పట్టాలు కలిగిన భూముల కంటే10 శాతం అదనంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పింది. ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు అతి తక్కువ పరిహారం ఇచ్చి వేలాది ఎకరాలు గుంజుకున్నారని , ల్యాండ్‌ పూలింగ్‌ విధానానికి జాతీయ భూ సేకరణ చట్టం వర్తించదని వక్ర భాష్యం చెప్పారని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.