Begin typing your search above and press return to search.
మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్ !
By: Tupaki Desk | 10 Dec 2020 2:14 PM ISTజగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభమైంది. ఈ పథకాన్ని వర్చువల్ విధానంలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. రూ.1,868.63 కోట్ల వ్యయంతో ‘జగనన్న జీవక్రాంతి’ పథకానికి శ్రీకారం చుట్టారు. తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుకొని మహిళలు జీవన స్థాయిని, ప్రమాణాలను పెంచుకోవాలనే సంకల్పంతో సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న జీవక్రాంతి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేస్తారు.
2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు రూ.1868.63 కోట్లు వ్యయం చేయనున్నారు. కాగా ఈ పథకాన్ని మూడు విడతలుగా అమలు చేయనున్నారు. మొదటి విడతలో 2021 మార్చి వరకు 20 వేల యూనిట్లు, రెండవ విడతలో 2021 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1,30,000 యూనిట్లు, మూడవ విడతలో 2021 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 99,000 యూనిట్లు.. మొత్తం మూడు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మరో హామీని ఈరోజు నెరవేర్చాం.
మహిళలకు మెరుగైన జీవనోపాధి, తద్వారా సుస్థిర ఆదాయం లక్ష్యమే 'జగనన్న జీవక్రాంతి' పథకం ముఖ్య ఉద్దేశం. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ద్వారా.. రైతుల్లో మరింత ఆర్ధిక అభివృద్ధి వస్తుంది. గత ప్రభుత్వాలు ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేశాయి. జగనన్న జీవక్రాంతి పథకాన్ని అమూల్‌తో ఒప్పందం చేసుకోవడం ద్వారా పాడి రైతులకు, మహిళలకు ఆర్ధికంగా చేయూతనిస్తుంది అని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేశాయని జగన్ చెప్పుకొచ్చారు. మహిళలకు ఆర్ధిక వనరులు పెరగాలని.. చేయూత, ఆసరా పథకాల ద్వారా రూ.5,400 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు.