Begin typing your search above and press return to search.

నేనున్నా జ‌గ‌న్ హామీతో వారంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి!

By:  Tupaki Desk   |   6 July 2019 7:53 AM GMT
నేనున్నా జ‌గ‌న్ హామీతో వారంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి!
X
స‌మ‌స్య ఏదైనా కావొచ్చు. సాయం కోసం ఇంటికి వ‌చ్చిన వారికి.. అండ‌గా నిలిఏ అల‌వాటున్న నేత‌గా దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి పేరుంది. శ‌త్రువైనా స‌రే త‌న ఇంటి గ‌డ‌ప తొక్కి సాయం కోసం అర్థిస్తే.. అప్ప‌టివ‌ర‌కూ ఉన్న శ‌త్రుత్వాన్ని ప‌క్క‌న పెట్టి.. స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌టానికి త‌న‌కున్న వ్య‌క్తిగ‌త పర‌ప‌తిని వాడ‌తార‌న్న పేరుంది.

తండ్రికి త‌గ్గ‌ట్లే..జ‌గ‌న్ కూడా వైఎస్ బాట‌లోనే న‌డుస్తున్నార‌ని చెప్పాలి.రాజ‌కీయ నేత‌ల్ని ప‌క్క‌న పెడితే.. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి సాయం కోసం ఆర్థించినా.. స‌మ‌స్య‌ను ఆయ‌న దృష్టికి తీసుకొచ్చినా వెనువెంట‌నే పాజిటివ్ గా రియాక్ట్ కావ‌ట‌మే కాదు.. సానుకూలంగా స్పందిస్తున్న గుణం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

తాజాగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ సింఫుల్ గా చెప్పాలంటే సెర్ప్ లో ప‌ని చేస్తున్న క‌ల్యాణ మిత్రులు కొత్త త‌ర‌హా భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో వారి ఉద్యోగాల్ని తీసేస్తార‌ని.. వారి జీతాలు పెర‌గ‌వ‌న్న దుర్మార్గ ప్ర‌చారాన్ని చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ ను క‌లిశారు క‌ల్యాణ మిత్రులు. త‌మ స‌మ‌స్య‌ల్ని ఏక‌రువు పెట్టుకున్న వారు.. త‌మకున్న సందేహాన్ని కూడా చెప్పుకున్నారు.

ఆ వెంట‌నే స్పందించిన జ‌గ‌న్‌.. మీకేం ఫ‌ర్లేదు.. నేనున్నా.. మీకెలాంటి అన్యాయం జ‌ర‌గ‌ద‌న్న హామీ ఇచ్చారు. నేను ముఖ్య‌మంత్రిగా ఉన్నంత కాలం మీరే క‌ల్యాణ మిత్రులుగా ఉండి పెళ్లిళ్లు చేస్తార‌న్న భ‌రోసాను ఇచ్చారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి స్పందించిన తీరు.. ఇచ్చిన హామీతో వారంతా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇక‌.. వారిని మ‌రింత సంతోషానికి గురి చేస్తూ వారికిస్తున్న ప్రోత్స‌హాకాల్ని పెంచేందుకు హామీ ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టివ‌ర‌కూ ప‌గ‌లుపూట పెళ్లి చేసే వారికి రూ.250 చొప్పున‌. .రాత్రిళ్లు జ‌రిగే పెళ్లిళ్ల‌కు సాయం చేసే వారికి రూ.500చొప్పున ప్రోత్సాహాకాన్ని అందించే వారు. ఆ స్థానే ఇప్ప‌డు వారికిస్తున్న రూ.250 స్థానే రూ.500.. రూ.500 స్థానే రూ.వెయ్యి ఇస్తామ‌న్న హామీని ఇచ్చారు. ఇక‌.. ఫీల్డ్ వెరిఫికేష‌న్ కు ఇప్ప‌టివ‌ర‌కూ ఇస్తున్న రూ.300 నుంచి రూ.600 వ‌ర‌కు పెంచుతున్న‌ట్లుగా చెప్పారు. ఇలా.. త‌మ స‌మ‌స్య‌ల్ని విన్నవించుకోవ‌టానికి వ‌స్తున్న వారికి జ‌గ‌న్ నుంచి వ‌స్తున్న స్పంద‌న‌కు వారు సంతోషానికి గురి అవుతున్నారని చెప్ప‌క త‌ప్ప‌దు.