Begin typing your search above and press return to search.

జగన్ నిర్ణయం.. టీడీపీ వెన్నులో వణుకు..

By:  Tupaki Desk   |   18 Oct 2019 4:17 AM GMT
జగన్ నిర్ణయం.. టీడీపీ వెన్నులో వణుకు..
X
విశాఖ భూకుంభకోణం.. విశాఖలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు అది ప్రభుత్వానిదైనా.. ప్రైవేటుదైనా గద్దెల వలే వాలి ఖజేశారన్న ఆరోపణలున్నాయి. టీడీపీ నేతల ధనదాహానికి వందల ఎకరాలు గుటకాయ స్వాహా అయిపోయాయనే విమర్శలు వెల్లువెత్తాయి.. ఏపీలోని తీరప్రాంత సంపన్న నగరం.. పారిశ్రామిక కేంద్రమైన విశాఖలో రియల్ భూమ్ ను క్యాష్ చేసుకొని టీడీపీ నేతలు సాగించిన భూదందాలు.. కబ్జాలపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు సాగించిన ఈ వికృత క్రీడపై అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్నో ఆరోపణలుచేసింది.

ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది.వందల కోట్లలో సాగిన ఈ భుకుంభకోణంపై విచారణకు ఆదేశించి టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

తాజాగా విశాఖలో సాగిన వందల కోట్ల భూకుంభకోణాలపై విచారణకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను వైసీపీ ప్రభుత్వం నియమించింది. ఈ సిట్ లో ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు.. ఒక రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జి కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి డా. విజయ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ సిట్ లో రిటైర్డ్ ఐఏఎస్ అనురాధ - రిటైర్డ్ జడ్జి భాస్కర్ రావులు సభ్యులుగా ఉన్నారు. ఇక వీరు అవసరమైన అర్హులను నియమించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. విశాఖ జిల్లాలో జరిగిన భూకుంభకోణంపై మూడు నెలల్లోనే సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక విశాఖ భూకుంభకోణంలో అక్రమార్కులను వదిలేది లేదని మంత్రి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.