Begin typing your search above and press return to search.
కోటి మందికి షాకిచ్చిన సీఎం జగన్ వరం?
By: Tupaki Desk | 9 Jan 2022 6:00 PM ISTకోరింతనే వరాలు ఇచ్చే దేవుడ్ని చూశాం. కానీ.. కోరకుండానే వరం ఇచ్చేసే వారుంటారా? అంటే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తాజాగా వినిపిస్తోంది. ఉద్యోగసంఘాల వారు పీఆర్సీ విషయంలో పట్టుబడుతుండటం.. తాజాగా ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన సీఎం.. ఉద్యోగులు కోరుకున్నట్లుగా 40 శాతం పీఆర్సీ ఇవ్వకుండా 23 శాతం ఇవ్వటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆ సందర్భంలో ఆయన నోటి నుంచి వచ్చిన అనూహ్య వరం ఒకటి ఉద్యోగులు పండుగ చేసుకునేలా మారితే.. ముఖ్యమంత్రి జగన్ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది మాత్రం ఊసురుమంటున్న పరిస్థితి. జగన్ సర్కారు తాజా నిర్ణయంతో తమ భవిష్యత్తు గందరగోళంలో పడినట్లేనన్న వ్యాఖ్య చేస్తున్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంతనే చేసే మొదటి పని.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని పేర్కొనటం తెలిసిందే. విపక్షంలో ఉన్న వేళలో.. నిరుద్యోగుల వెతలు తీరేలా.. వారికి ఉద్యోగప్రకటనలు చేసి.. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని జగన్ పదే పదే చెప్పటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో.. ఇప్పటికే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఆశల మీద నీళ్లు పోసినట్లైంది.
ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీ ప్రకారం చూస్తే.. 3 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. అంతేకాదు.. తమ ప్రభుత్వంలో ప్రతి జనవరి ఒకటిన ఉద్యోగాల కేలండర్ ను విడుదల చేస్తానని ఊరించారు. డిగ్రీలు సాధించిన పిల్లలు.. ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉండటం వేదనకు గురి చేస్తుందని.. వారి కష్టాల్ని తీరుస్తానన్న జగన్.. అందుకు భిన్నంగా ఉద్యోగులు కోరకుండానే వారి పదవీ విరమణ వయసును పెంచటం ఇప్పుడు శరాఘాతంగా మారింది.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ.. పోలీసు అమరవీరుల దినోత్సం వేళ.. ఖాళీగా ఉన్న 6500 పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పారు. ఇవి కాకుండా.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు దాదాపు 2.32 లక్షలుగా చెబుతున్నారు. ఇలా లక్షల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ లేకపోగా.. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన వరంతో.. రాబోయే రెండేళ్లలో కొత్తఖాళీలు కూడా ఏర్పడవు. ఇప్పటివరకు.. ఇవాళ కాకుంటే రేపు.. రేపు కాకుంటే ఎల్లుండి అయినా సీఎం జగన్ తమకు మాటిచ్చినట్లుగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఆశగా చూశారు. వారి ఆశలు అడియాశలు అయ్యేలా తాజా వరం మారిందంటున్నారు.
ఇక.. సీఎం జగన్ ఇచ్చిన వరం కోటి మందిని నిరాశకు గురి చేసిందన్న మాట ఎలా? అన్న ప్రశ్న కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఒక చిన్న లెక్క చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ ఉద్యోగాల కోసం అప్పట్లో 26 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 22 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్ వన్.. పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు మాత్రం సచివాలయ ఉద్యోగాలకు అప్లై చేయలేదు. ఈ లెక్కన రాష్ట్రంలో తక్కువలో తక్కువ వేసుకున్నా 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఆశిస్తున్నారు. ఇంటికిముగ్గురు చొప్పున వేసుకున్నా.. దాదాపు 90 లక్షల మంది అవుతారని.. కోటికి దగ్గరగా ఉన్న వీరి వేదన..రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు.ఏమైనా.. సీఎం జగన్ అనూహ్య వరం..భారీగా నిరాశకు గురి చేయటాన్ని ఎవరూ ఊహించలేదని చెప్పక తప్పదు.