Begin typing your search above and press return to search.
రాజన్న పాలనలో నవరత్నాల కోసం రైతులు ఇబ్బంది పడాలా?
By: Tupaki Desk | 5 Sept 2020 6:20 PM ISTకేంద్రం ఆదేశించినట్టు ఏపీ ప్రభుత్వం రైతుల విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు మిగిస్తే వైసీపీ కొంప కొల్లేరు కావడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో ఏ ప్రభుత్వమైనా నిలబడాలంటే రైతులే ప్రధానమని.. వారితో గేమ్స్ ఆడిన వారు ఎవరూ గెలిచిన చరిత్ర లేదని అంటున్నారు. అందుకే ఈ విద్యుత్ మీటర్ల వ్యవహారంలో జగన్ సర్కార్ చాకచక్యంగా వ్యవహరించకుంటే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఏపీలోని ప్రభుత్వం ఎందుకో కొంచెం దారితప్పుతోందని అంటున్నారు. రైతు ఎలా ఉంటాడు అని అడిగితే ‘ ప్రపంచంలో వైఎస్ఆర్ ను తార్కాణంగా చూపిస్తారు’. అలాంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతులు పంపుసెట్స్ కు మీటర్ బిగిస్తున్నారు.ఇదే జరిగితే ప్రతీరోజు కరెంట్ ఎంత ఖర్చు అయ్యిందనేది మీటర్లు చూసుకుంటూ ఒత్తిడికి గురి అవుతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ మీటర్ల బిగింపుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు అని అంటున్నారు.. వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వ్యతిరేకించి.. రాష్ట్ర బడ్జెట్ నుంచే రైతుల కోసం ఆరోజు ఉచిత కరెంట్ అమలు చేశాడు.రైతే రాజు అని నమ్మిన వ్యక్తి వైఎస్ఆర్ అని కీర్తిని పొందాడు.
అలాంటి రాజన్న పరిపాలన అందిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చి గెలిచాడు. కానీ ఇప్పుడు ‘నవరత్నాల’ అమలు కోసం బీజేపీ తలవంచడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వచ్చి ఇప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు కట్టడం కోసం మేము చస్తున్నామని సమాధానం చెప్తుంటే అందరూ షాక్ తింటున్నారు.
చంద్రబాబు మంచి పరిపాలన చేయగలిగే వ్యక్తి అయినా కూడా అతడిని దారుణంగా ఓడగొట్టి కేవలం 23 సీట్లు ఇచ్చారని.. అసలు ఈ మీటర్స్ పెట్టడం టీడీపీకి లాభం చేర్చడమేనని వైసీపీ వాళ్లే వాపోతున్నారు.
ఏది ఏమైనా త్వరలో ఈ పథకం ద్వారా రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుందని క్షేత్రస్థాయిలో రిపోర్ట్స్ వస్తున్నాయి. అన్ని ఆలోచన చేసి రైతులకు క్లియర్ క్లారిటీ ఇచ్చి రైతులను, రైతు సంఘాలను కూర్చోబెట్టి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.