Begin typing your search above and press return to search.

బాబు బాంబు పేల్చారు.. మెట్రో ఘ‌న‌త నాదే!

By:  Tupaki Desk   |   29 Nov 2017 2:06 PM GMT
బాబు బాంబు పేల్చారు.. మెట్రో ఘ‌న‌త నాదే!
X
తెలంగాణ ప్ర‌జ‌లు - హైద‌రాబాద్‌లోని అన్ని ప్రాంతాల ప్ర‌జ‌లు ఎన్నో నాళ్లుగా ఎదురు చూసిన మెట్రో రైలు నిన్న ప్రారంభ‌మై పోయింది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ - సీఎం కేసీఆర్‌ - గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ వంటి అతిర‌థ మ‌హార‌థులు పాల్గొన్నారు. ఇంతవ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఈ సంద‌ర్భంలోనే కొంద‌రు మేధావులు.. మాత్రం ఏపీ వైపు దృష్టి పెట్టారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు మెట్రోపై ఎలాంటి కామెంట్లు చేస్తారా? ఏమంటారా? అని వారు ఆతృత‌గా ఎదురు చూశారు. అయితే, నిన్నంతా పూర్తి బిజీగా గ‌డిపిన చంద్ర‌బాబు మెట్రోపై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. కానీ, తాజాగా బుధ‌వారం మాత్రం ఆయ‌న స్పందించారు.

ఇక‌, ఎలా స్పందించారు? ఏమ‌న్నారు? అంటే.. మామూలుగా ఆయ‌న ఎప్పుడూ కొట్టుకొనే డ‌ప్పునే మ‌ళ్లీ వాయించేశారు. హైద‌రాబాద్ మెట్రో త‌న పోరాట ఫ‌లిత‌మేన‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, అవకాశం దొరికినప్పుడల్లా హైటెక్‌ సిటీ నుంచి... అన్నీ నేనే కట్టించాననే చెప్పుకుంటున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈక్ర‌మంలోనే హైదరాబాద్‌ మెట్రో రైలు ఘనత కూడా తనదేనని చెప్పుకొచ్చారు చంద్ర‌బాబు. హైదరాబాద్‌ మెట్రో రైలు కోసం తన హయాంలో పోరాటం చేశానని తెలిపారు. ‘మెట్రోను బెంగళూరు, అహ్మదాబాద్‌ నగరాలకే పరిమితం చేశారు. అప్పుడు నేనే అధికారంలో ఉన్నా. ఆ స‌మ‌యంలో నాకెంతో బాధ‌క‌లిగింది. తెలుగు వాళ్లు మెట్రో రైలు ఎక్క‌కూడ‌దా? అనుకున్నా. తెలుగు వారు ఏ విష‌యంలో తీసిపోయారు? అని నాలోనేనే ప్ర‌శ్నించుకున్నా. వెంట‌నే స్వ‌యంగా నేను పోరాడి హైదరాబాద్‌ను ఆ జాబితాలో చేర్పించా. దానివల్లే మెట్రో రైలు హైదరాబాద్‌ రాగలిగింది`` అని.. మ‌ళ్లీ సొంత డ‌బ్బా వాయించేశారు.

``కర్ణాటక, గుజరాత్‌ ప్రభుత్వాలు మెట్రోను వేగంగా పూర్తి చేశాయి. నా తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మెట్రోను ఆలస్యం చేశారు. అందుకే ఇంతకాలం పట్టింది. అప్పట్లోనే నేను ఉన్నప్పుడే ఢిల్లీ మెట్రో శ్రీధరన్‌తో హైదరాబాద్‌ మెట్రోపై అధ్యయనం చేయించాం. హైదరాబాద్‌ అభివృద్ధిలో మా ముద్ర పోయేది కాదు. మెట్రోతో పాటు జీఈఎస్‌ జరుగుతున్న హెచ్‌ఐసీసీ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు... ఇవన్నీ టీడీపీ హయాంలో వచ్చినవే. నేను ప్రారంభించినా...ప్రారంభించకున్నా...హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్న సంతృప్తి నాకుంది`’ అని బాబు చెప్పుకొచ్చారు. మొత్తానికి చంద్ర‌బాబు డ‌బ్బు విని మీడియా ప్ర‌తినిధులు నోరెళ్ల బెట్టారు.