Begin typing your search above and press return to search.
కేసీఆర్ కార్ల నెంబర్లను వాడుతున్నది వాళ్లేనట!
By: Tupaki Desk | 15 Jun 2018 10:06 AM ISTరెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సీఎం కారు నెంబర్‌ను వాడేసిన వైనం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి వెలువడుతున్న విశేషాలు ఆసక్తికరంగా మారటమే కాదు.. హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ అధికారపక్షంలోనూ.. పోలీసు ఉన్నతాధికారుల మధ్య పెద్ద ఎత్తున చర్చకు కారణమైన ఈ ఉదంతంపై బయటకు వచ్చిన విశేషాలు.. ఓపెన్ గా అందరి ముందు షేర్ చేసుకునేలా లేవన్న వాదన ప్రధానంగా వినిపిస్తోంది.
మీడియాలో ప్రముఖంగా వచ్చిన ఈ ఉదంతంపై తెలంగాణ పోలీసులు విచారణకు దిగినట్లుగా చెబుతున్నారు. తమ దగ్గరున్న ఆధారాలతో క్రాస్ చెక్ చేసిన వారికి దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సర్కారులో కీలక భూమిక పోషించే వారు.. తెలంగాణ రాష్ట్రంలో పవర్ ఫుల్ స్థానాల్లో ఉన్న కటుంబాలకు సంబంధించిన వారు సరదాగా ఇలాంటి పని చేశారని చెబుతున్నారు.
ఈ ఉదంతంపై అధికారులు ఒక్క అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఉందంటున్నారు. తరచూ మీడియాలో కనిపిస్తూ పలు వివరాల్ని వెల్లడించే అత్యుత్తమ అధికారులు సైతం సీఎం కార్ నెంబరును అనధికారికంగా వాడేస్తున్న వైనంపై మాట్లాడేందుకు మాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించే కార్ల సముదాయానికి కేటాయించిన నెంబరును అనధికారికంగా ఆరేడు వాహనాలకు వాడేస్తున్న వైనం ఒక మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఫ్యాన్సీ నెంబర్లను లక్షలు పెట్టి సొంతం చేసుకోవటం తెలిసిందే అయినా.. సీఎం కారు నెంబరును కొందరు అనధికారికంగా వాడటం.. ఆ కార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడం.. దీంతో చలానాలు నమోదు కావటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
ఈ ఉదంతంపై అధికారులు ఒక్క అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఉందంటున్నారు. తరచూ మీడియాలో కనిపిస్తూ పలు వివరాల్ని వెల్లడించే అత్యుత్తమ అధికారులు సైతం సీఎం కార్ నెంబరును అనధికారికంగా వాడేస్తున్న వైనంపై మాట్లాడేందుకు మాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
