Begin typing your search above and press return to search.

మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు - సీఎం ఫై ఇంకో సీఎం

By:  Tupaki Desk   |   29 Nov 2020 4:20 PM IST
మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు - సీఎం ఫై ఇంకో సీఎం
X
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళన కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఛలో పేరిట రైతులు భారీ ఎత్తున తరలివచ్చిన సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాల కారణంగా రైతులకు కలిగే నష్టాన్ని దేశప్రజలందరి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ఆందోళనకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. వాటి పిలుపు మేరకు ఛలో ఢిల్లీలో పాల్గొనేందుకు పంజాబ్‌, హర్యానా నుంచి లక్షలాదిగా రైతులు తరలివచ్చారు. అయితే ,ఛలో ఢిల్లీ ర్యాలీలో పరిస్థితిని అదుపు చేయడంలో హర్యానా ప్రభుత్వం విఫలమైందని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ విమర్శలు కురిపించారు. అలాగే ప్రభుత్వం విఫలమవడమే కాకుండామళ్లీ పంజాబ్‌ ప్రభుత్వంపై సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ విమర్శలు చేయడం తగదని అన్నారు.

ఈ వ్యవహారం పై సీఎం అమరీందర్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ .. దేశ రాజ‌ధానిలో రైతులు చేస్తున్న ఆందోళ‌న ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య వైరానికి కారణం అయింది. ఇక నుంచి హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్‌ లాల్ ఖ‌ట్ట‌ర్ ఫోన్ చేసినా మాట్లాడ‌న‌ని , రైతులకు క్షమాపణ చెప్పే వరకు తాను మాట్లాడనని స్పష్టం చేశారు. రైతులు నిర‌స‌న తెల‌ప‌డం వాళ్లు హ‌క్కు. అందుకే మేం వాళ్ల‌ను అడ్డుకోలేదు. కానీ మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు వాట‌ర్ కెనాన్లు, టియ‌ర్ గ్యాస్‌లు వారిపై ప్ర‌యోగిస్తున్నారు, వాళ్ల‌ను మేము ఆప‌డం లేదు, ఢిల్లీ ఆప‌డం లేదు. మ‌రి మీరు ఎందుకు ఆపుతున్నారు అంటూ సీఎం ను ప్రశ్నించారు. పరిస్థితిని అదుపు చేయకపోగా రైతుల గ్రూపుల్లో అవాంఛనీయ శక్తులు ఉన్నాయని ఆరోపించడమేంటి, వారి నిరసనల వెనక ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదు.

కేవలం పంజాబ్‌, హరియాణాకు చెందిన రైతులు మాత్రమే ఉన్నారు. మేం సమస్యకు పరిష్కారాన్ని మాత్రమే కోరుకుంటున్నాం. మా రైతుల్ని బాధపెట్టాలని ఏ మాత్రం కోరుకోవడం లేదు, అయన క్షమాపణలు చెప్పే వరకు మాట్లాడేది లేదని అన్నారు.

అయితే ,అంతకుముందు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ నిరసన కార్యక్రమానికి పంజాబ్‌ ప్రభుత్వమే కారణమని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ శనివారం ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఆఫీస్‌ బేరర్లు ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు