Begin typing your search above and press return to search.

అద్భుతం.. అంగారక దృశ్యం.. మార్స్ పై ప్రయాణిస్తున్నమేఘాలు!

By:  Tupaki Desk   |   28 March 2021 12:30 AM GMT
అద్భుతం.. అంగారక దృశ్యం.. మార్స్ పై ప్రయాణిస్తున్నమేఘాలు!
X
అరుణగ్రహంపై సూక్ష్మజీవులు ఉన్నాయా? అని పరిశోధించడానికి 2012లో ఆ గ్రహం మీద కాలు మోపింది నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్. దానిపై ఉన్న నావిగేషన్ కెమెరాలతో పలు వీడియో చిత్రాలను రూపొందించింది. వాటిలో భూమిపై మేఘాలు ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలే అరుణుడిపై దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని నార్త్ కరోలినా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ పాల్ బైర్న్ ప్రకటించారు. మార్చి 19,2021న మార్స్ పై మేఘాలు ప్రయాణిస్తున్నాయంటూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను ఆయన పంచుకున్నారు. ఈ దృశ్యాలు మార్స్
క్యూరియాసిటీ కుడి నావిగేషన్ కెమెరాలతో రూపొందించినవని పేర్కొన్నారు.

ఎన్నో అద్భతం దృశ్యాలు

క్యూరియాసిటీ రోవర్ 2.43జీబీ పరిమాణాన్ని కలిగిఉన్న అత్యధిక రిజల్యూషన్ కలిగిన అంగారక స్వరూప చిత్రాన్ని చూపే 1000 ఫొటోలు చిత్రీకరించిందని ఆయన వెల్లడించారు. ఈ దృశ్యాలు 360 డిగ్రీల కోణంలో ఉన్నాయి. రోవర్ ఒక్కో షాట్ తీయడానికి ఆరున్నర గంటలకుపైగా సమయం అవసరమని క్యూరియాసిటీ రోవర్ మిషన్ కు నాయకత్వ వహించిన శాస్త్రవేత్త అశ్విన్ వాస్వాడ వెల్లడించారు. అంగారక గ్రహం స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపే అద్భత దృశ్యాలను చిత్రీకరించిందని ఆయన తెలిపారు. మాస్ట్ క్యామ్ కెమెరాలతో పాటు నావిగేషన్ కెమెరాల సాయంతో 1.3బిలియన్-పనోరమ చిత్రాన్ని 2013లోనే చిత్రీకరించిందని ఆయన వివరించారు.

సూక్ష్మజీవులకు అనువైన ప్రదేశం

అరుణగ్రహంపై ఈ రోవర్ 21.92 కిలోమీటర్లు ప్రయాణించిందని తెలిపారు. నావిగేషన్, ఇతర కెమెరాలతో పాటు మొత్తం 6,54,661 చిత్రాలు రూపొందించిందని వెల్లడించారు. ఈ రోవర్ సాయంతో అక్కడ ఓ పురాతన సరస్సనూ కనుగొన్నారు. అంతేకాకుండా సూక్ష్మజీవుల నివాసానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతేడాది రోవర్ తీసిన ఓ సెల్ఫీలో ఓ ఒయాసిస్ ను కనుగొన్నట్లు నాసా ప్రకటించింది. కాగా సూక్ష్మజీవులు ఉన్నాయని, ఉప్పుగా, నిస్సారమైన చెరువులు ఉండేవని క్రమంగా అవి ఎండిపోయినట్లు కొత్త సాక్ష్యాలను రోవర్ కనుగొంది.

అరుణ గ్రహంపై ప్రయోగాలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రోవర్ రూపొందించిన దృశ్యాలు చాలా ఆసక్తికరంగా మారాయి. భూమిపై మేఘాలు ప్రయాణించేతీరుగా అద్భుతంగా ఉన్నాయి.