Begin typing your search above and press return to search.
కరోనా వ్యాక్సిన్ హబ్ గా భారత్ మారుతోందా?
By: Tupaki Desk | 16 May 2020 7:30 PM ISTప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం వాయిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు అన్ని దేశాల్లో విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి. వ్యాక్సిన్ కనిపెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే భారత్ లోనూ ఆ దిశగా వేగంగా పరిశోధనలు సాగుతున్నాయి. మొత్తం 150 దేశాలకు వివిధ రకాల ఔషధాలు, వ్యాక్సిన్ లు సరఫరా చేసే భారత్.. ప్రపంచ వ్యాక్సిన్ ల హబ్ గా గుర్తింపు పొందింది.
ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై కూడా భారత తీవ్ర పరిశోధనలు చేస్తోంది. దేశంలో వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన మొత్తం 14 ప్రాజెక్టులను ప్రైవేటు కంపెనీలు, విద్యాసంస్థలతో కలిసి ప్రారంభించింది. మొత్తం 8 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇందులో ఒకటి క్లినికల్ ట్రయల్స్ దశకు చేరింది. మరో నాలుగు అడ్వాన్సుడు దశలో ఉన్నాయి.
ఈ వ్యాక్సిన్ తయారీ ప్రోగ్రామ్ లకు పీఎం కేర్స్ ద్వారా రూ.100 కోట్ల నిధులు సమకూర్చారు. మహారాష్ట్రలో 4 - తెలంగాణలో 3 - గుజరాత్ - తమిళనాడు - ఢిల్లీ - మధ్యప్రదేశ్ - కేరళ - పంజాబ్ లలో ఒక్కో కరోనా వ్యాక్సిన్ పరిశోధన జరుగుతోంది. దీంతో వచ్చే సంవత్సరాంతానికి భారత్ కరోనా వ్యాక్సిన్ల హబ్ గా మారడం ఖాయమంటున్నారు.