Begin typing your search above and press return to search.

బెజ‌వాడ‌లో భ‌గ‌భ‌గ‌లే.. ఆందోళ‌న రేపుతున్న అధ్య‌య‌నం

By:  Tupaki Desk   |   19 April 2020 7:00 AM IST
బెజ‌వాడ‌లో భ‌గ‌భ‌గ‌లే.. ఆందోళ‌న రేపుతున్న అధ్య‌య‌నం
X
ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో వాతావ‌ర‌ణం ఉక్క‌పోత‌గా.. వాతావ‌ర‌ణం వేడిగా ఉంటోంది. ఈ ప‌రిస్థితి విజ‌య‌వాడ‌లో అధికంగా ఉంది. ఇక వేస‌వి కాలం అయితే ఉష్ణోగ్ర‌త్త‌లు భారీగా పెరిగిపోయి ప్ర‌జ‌లంతా వేడిమిని త‌ట్టుకోలేని ప‌రిస్థితులు. ఇప్పుడే ఇలా ఉంటే భ‌విష్య‌త్‌లో మ‌రింత భ‌గ‌భ‌గ‌లు ఉంటాయ‌ని ఓ తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ఈ స‌ర్వేలో విజ‌య‌వాడ‌లో ప‌రిస్థితులు దారుణంగా మారుతాయ‌ని భ‌విష్య‌త్‌ లో వాతావ‌ర‌ణంలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయ‌ని హెచ్చరించింది. సమీప భవిష్యత్తు లో విజయవాడ భరించలేని విధంగా ఉంటుందని ఆ అధ్యయనం చెబుతోంది.

నేషనల్ జియోగ్రాఫిక్ (ఎన్‌జీ) త‌న నివేదికలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఆ నివేదిక‌ ప్రకారం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని విజయవాడపై తీవ్ర ప్రభావం చూపనున్నాయంట‌. ప్రస్తుతం ఏడాదిలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత 95 రోజులు మాత్రమే ఉంటోంది. వచ్చే 50 ఏళ్లలో 35 డిగ్రీల వేడి ఉండే రోజులు 95 నుంచి 214 రోజులకు పెరగనుంద‌ని తెలిపింది. భ‌విష్య‌త్‌ లో బెజ‌వాడలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఊహించలేనంత మార్పులు రాబోతున్నాయని పేర్కొంది.

కొన్ని ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల్లో నేష‌న‌ల్ జియోగ్రాఫిక్ 2070 నాటికి రాబోయే వాతావరణ మార్పులపై ప‌రిశోధనలు చేప‌ట్టింది. ఆ ప‌రిశోధ‌న‌ల్లో ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుతం విజయవాడ ఎరిడ్, హాట్ స్టెప్పీ జోన్‌గా ఉంది. భవిష్యత్తు లో ట్రాపికల్ సవన్నా జోన్ (ఎండలు ఎక్కువగా)‌గా మారనుందని తెలిపింది. అంటే ఏడాదిలో ఎక్కువ కాలం ఎండలే ఉంటాయి. ఫలితంగా వర్షాలపై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది.

విజయవాడలో ప్రతీ నెలలో సగటు ఉష్ణోగ్రత 18 డిగ్రీల దాకా ఉంటుంది. వేడిగా, ఉక్కపోతతో ఆ ప్రాంతం ఉంటుంది. దక్షిణ, ఉత్తర ధృవాలకు దగ్గరగా ఉన్న నగరాల్లో సీజన్లు మారడం స‌హ‌జం కానీ విజయవాడలో మాత్రం కాలాలు మారిన అక్క‌డి వాతావ‌ర‌ణం మాత్రం ఏం మార‌దని ఆ నివేదిక చెబుతోంది. ఎప్పుడూ ఎండలు వుంటాయని ట్రాపికల్ సవన్నా ప్రాంతాల్లో ఎండాకాలం తక్కువగా, వేడి ఎక్కువగా, తడిగా ఉంటుందని వివ‌రించించింది. ఈ ప‌రిస్థితి తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీలో ఉన్న గలాఫీ నగరంలాగే ఉంటుంద‌ని ఉదాహ‌ర‌ణ‌కు చెప్పింది.

ఈ విధంగా వాతావ‌ర‌ణ మార్పులు చోటుచేసుకుంటే విజయవాడలో నీటి లభ్యత, వ్యవసాయం, మౌలిక వసతులపై తీవ్రంగా ప్ర‌భావం ప‌డుతుందని నేష‌న‌ల్ జియోగ్రాఫిక‌ల్ అంచనా వేసింది. అయితే ఆ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ప్రజల శారీరక మార్పులు మారుతాయ‌ని తెలిపింది.