Begin typing your search above and press return to search.

పెళ్లి చేసుకోవాలంటే ఆ పరీక్ష పాస్ కావాల్సిందే ..ఏంటో తెలుసా !

By:  Tupaki Desk   |   26 Nov 2019 1:30 AM GMT
పెళ్లి చేసుకోవాలంటే ఆ పరీక్ష పాస్ కావాల్సిందే ..ఏంటో తెలుసా !
X
పెళ్లి ..ప్రతి ఒక్కరి జీవితం లో ఒక మధురమైన అనుభూతి. ప్రతి ఒక్కరు కూడా పెళ్లి జీవితం లో మధురానుభూతిని పొందాలని అనుకుంటారు. పెళ్లి అనేది ఇద్దరి మనసుల కలయిక. పెళ్లంటే ఆలుమగలు కలవడమే కాదు. అది కొత్త జీవితానికి ప్రారంభం. ఇద్దరూ పరస్పర సహకారంతో జీవించడమే కాదు.. పిల్లలను సైతం సక్రమంగా పోషించగలగాలి. ఎందో బాధ్యతగా సంసార సాగారాన్ని ఈదాలి. ఈత రాకుండా దూకితే.. వారిద్దరి జీవితాలే కాదు, వారిపై ఆధారపడే పిల్లల భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది.

దీనితోనే పెళ్లి చేయాలి అంటే అమ్మాయి తల్లిదండ్రులు భయపడుతుంటారు. అబ్బాయి గురించి అన్ని వివరాలు కనుక్కొని , ఆ కుటుంబం గురించి ఏడు తరాల వరకు ఆరా తీసి కానీ , అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయరు. ఇక పోతే ఇప్పటి వరకు అమ్మాయి, అబ్బాయి కుటింబీకులు ఒప్పుకుంటే పెళ్లి జరిగేది. కానీ ,ఇక పై ఆలా కుదరదు. కానీ, ఇండొనేసియాలో పెళ్లి చేసుకోవాలంటే మాత్రం కచ్చితం గా కోర్సు చేయాల్సిందే. ఆ కోర్సు పరీక్షలు పాసవ్వాల్సిందే. లేదంటే పెళ్లి జరగదు.

2020 నుం చి ఈ కొత్త రూల్ ను అమలు చేస్తామని ఆ దేశ హ్యూమన్ డెవలప్‌‌ మెంట్ అండ్ కల్చరల్ ఎఫైర్స్ విభాగం ప్రకటించింది. పెండ్లి చేసుకోవాలంటే భాగస్వామి గా ఎలా ఉండాలో ముం దు నేర్చుకోవాలని. లేకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది అని తెలిపింది. ఈ ప్రత్యేక ప్రోగ్రామ్‌‌ లో భాగంగా ప్రత్యే కంగా 3 నెలల మ్యా రేజ్‌‌ కోర్సును అక్కడి సర్కారు స్టార్ట్‌‌ చేయనుంది. పెండ్లికి ముందు ప్రతి ఒక్కరూ ఈ కోర్సును పూర్తి చేయాలి. ఆ తర్వాత పరీక్ష పెట్టి పాసైన వారికి సర్టిఫికెట్‌‌ ఇస్తారు. అదుం టేనే పెండ్లి చేసుకోవడానికి అర్హులు.కోర్సు ఫ్రీ గా ఇస్తారు. ఈ కోర్సులో సంతానోత్పత్తి, అనారోగ్య నివారణ, పిల్లల సంరక్షణ చిట్కాలు వంటివి నేర్పిస్తారు. ఈ కోర్సు ను ఎవరైనా తిరస్కరించినా, పరీక్షల్లో విఫలమైనా.. వారు పెళ్లి చేసుకోడానికి అనర్హులు. ఈ నిబంధన అతిక్రమించి పెళ్లి చేసుకున్నా.. వారి పెళ్లి అక్కడ చట్టబద్దం కాదు. ఇండొనేసియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అక్కడి నేతలు నేతలు తప్పుబడుతున్నా రు.