Begin typing your search above and press return to search.

క్లీన్ క్లీన్.. లెట్రిన్ క్లీన్.. కేజ్రీవాల్ కొత్త పథకం

By:  Tupaki Desk   |   16 Nov 2019 9:28 AM GMT
క్లీన్ క్లీన్.. లెట్రిన్ క్లీన్.. కేజ్రీవాల్  కొత్త పథకం
X
ఓ సీఎం కానుక ఇస్తున్నాడంటే అది ఎంత పెద్దదో.. అపూరమైనదో.. లేక మన ఆర్థిక అవసరాలను ఎలా తీరుస్తుందోనని అందరూ గంపెడాశలు పెట్టుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వరాలిస్తే వారి పంట పండినట్టు భావిస్తారు. కేసీఆర్ తన సొంతూరు చింత మడకలో ఇంటికి 10 లక్షలు ఇస్తామనగానే తెలంగాణ సమాజమే షాక్ తిన్నది. వరాలు అంటూ ఇలాంటివి రా బై అంటూ గొప్పలు చెప్పుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మూడెకరాలు లేదా జీతాలు పెంచుడు, పదోన్నతలు కేసీఆర్ భారీ కానుకలే ఇస్తుంటాడు. కానీ దేశ రాజధాని ఢిల్లీ ని పాలిస్తున్న సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన ఉచిత కానుక చూసి ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకున్నారు.

తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఓ ఉచిత కానుక ను ఢిల్లీ ప్రజలకు ఇచ్చాడు. త్వరలోనే ఢిల్లీ ఎన్నికల కు వేళ అవుతుండడంతో కేజ్రీవాల్ అంతా ఫ్రీ అంటూ వరాల వాన కురిపిస్తున్నారు. ఇటీవలే మెట్రో లో మహిళలకు ఫ్రీ ఇచ్చాడు. ఇక బస్సులో కూడా మహిళల కు ఉచిత ప్రయాణం కల్పించాడు. కరెంట్ బిల్లులు పరిమితి వరకూ ఫ్రీ ఇచ్చాడు. ఇలా మరోసారి అధికారం దక్కించుకునేందుకు క్రేజ్రీవాల్ ఉచితాల బాట పట్టారు.

తాజాగా శుక్రవారం మరో ప్రకటన చేశారు. అది వింటే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంకు నిండితే ప్రభుత్వమే క్లీనింగ్ చేస్తుందట.. ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ 'ముఖ్యమంత్రి సెప్టిక్ ట్యాంక్ సఫాయి యోజన' పేరు తో ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం 80 ట్రక్కులను కూడా సిద్ధం చేశారు.

ఢిల్లీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని.. ఎక్కడ పడితే అక్కడ లీక్ కావడం వల్ల కలుషితం అవుతోందని.. ప్రజలు రోగాల బారిన పడుతున్నారని.. అందుకే ఈ సెప్టిక్ ట్యాంక్ ఫ్రీ సర్వీస్ తెచ్చినట్టు కేజ్రీవాల్ తెలిపారు. ఇలా ఎవ్వరూ ఊహించని విధంగా లెట్రిన్ క్లీన్ చేసేందుకు ఏకంగా తన పేరే పెట్టుకొని పథకాన్ని ప్రవేశపెట్టిన కేజ్రీవాల్ తీరు ఆసక్తి రేపుతోంది.