Begin typing your search above and press return to search.

క్లీన్ ఏపీ, జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభం

By:  Tupaki Desk   |   2 Oct 2021 9:39 AM GMT
క్లీన్ ఏపీ, జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభం
X
దేశంలో పరిశుభ్రత రాష్ట్రం ఏదైనా ఉందంటే,అది ఏపీ రాష్ట్రం అని చెప్పుకొనే విధంగా, స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుడుతోంది. గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జరుగనుంది. 2021, అక్టోబర్ 02వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ బెంజి సర్కిల్ వద్ద సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా…4 వేల 097 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారు. క్లాప్ కార్యక్రమంలో గార్బేజ్‌ ఫ్రీ, బిన్‌ ఫ్రీ, లిటర్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్ది జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

నేడు వాళ క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌–క్లాప్ కార్యక్రమం సంద‌ర్భంగా సదరు వాహ‌నాలు విజ‌య‌వాడ‌లోని బెంజి స‌ర్కిల్ నుంచి బారులుగా ప‌రుగులు తీరాయి. స్వచ్ఛాంధ్రపదేశ్‌ నినాదంతో చెత్త సేకరణ కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 13 వేలకు పైగా ఉన్న పంచాయ‌తీల్లో సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టం ప్రవేశ పెడుతున్నారు. 10 వేల మంది గ్రామ పంచాయ‌తీ కార్మికులు ,కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే పరిశుభ్రతలో తిరుపతి, విశాఖ, విజయవాడలకు అవార్డులు వచ్చాయి. శానిటేషన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తడి, పొడి చెత్త సేకరణ కోసం ఇంటింటికి 3 డస్ట్‌బిన్‌లు ఇవ్వనున్నారు.

రాష్ట్రంలోని 65 నాన్‌ అమృత్‌ సిటీలలో సెప్టిక్‌ ట్యాంక్‌ ల నుంచి సేకరించిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్లు (ఎఫ్‌ ఎస్‌ టీపీ) ఏర్పాటు చేయనున్నారు. చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ కేంద్రాల వద్ద నలుగురు చొప్పున సిబ్బంది నియమించి…జీత భత్యాలు, నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. కొత్తగా 4 వేల 171 చెత్త నుంచి సంపద తయారు చేసే..కేంద్రాలను నిర్మించనున్నారు. 6,417 ఇన్సినరేటర్‌ పరికరాలను. 10,645 పంచాయతీలలో వర్మి కంపోస్ట్‌ నిర్వహణ, నాన్‌ రీసైక్లింగ్‌ వ్యర్థాలను సమీపంలోని సిమెంట్‌ ఫ్యాక్టరీలు, దోమల నివారణకు 10,628 థర్మల్‌ ఫాగింగ్‌ మిషన్లు పంపిణీ చేపడతారు.