Begin typing your search above and press return to search.

మాల్..ఎయిర్ పోర్ట్..బయట టీ ఎలా తాగాలో కొత్త రూల్

By:  Tupaki Desk   |   26 Aug 2019 11:46 AM IST
మాల్..ఎయిర్ పోర్ట్..బయట టీ ఎలా తాగాలో కొత్త రూల్
X
పర్యావరణం మీద అవగాహన పెరగటం మంచిదే. కానీ.. దేనికైనా హద్దు ఉండాలి. పర్యావరణానికి ఏదో మేలు చేయాలన్న హడావుడిలో తీసుకునే నిర్ణయాలు ఇబ్బందిగా మారుతుంటాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం ఇలాంటిదేనని చెప్పాలి.

పర్యావరణానికి మేలు చేస్తుందన్న ఉద్దేశంతో మొన్నటి వరకూ ప్లాస్టిక్ కప్పుల్లో టీ అందించే దానికి బదులుగా పేపర్ కప్ లను అందుబాటులోకి తేవటం తెలిసిందే. ఒకరకంగా చూస్తే ఇది మంచి నిర్ణయమేనని చెప్పాలి. తాజాగా దాని స్థానంలో మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

దేశంలోని ప్రముఖ రైల్వే స్టేషన్లు.. బస్సు డిపోలతో పాటు మాల్స్.. విమానాశ్రయాల్లో ఎక్కడైనా సరే మట్టి కప్పుల్లో టీని అమ్మాలన్న నిర్ణయం తీసుకున్నారు. కనీసం వంద స్టేషన్లలో మట్టి కప్పుల్లో టీ అమ్మేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కారణంగా పర్యావరణానికి మేలు కలగటంతో పాటు.. స్థానికంగా ఉండే కుమ్మరులకు ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు.

ఇవాళ.. రేపటి రోజున కుమ్మరులు తమ సంప్రదాయ పనిని చేస్తున్నట్లుగా చెప్పలేం. ఒకవేళ చేస్తున్నా.. మట్టి కప్పుల కారణంగా ధర పెరగటంతో పాటు.. వాటి శుభ్రత విషయంలో షాపు నిర్వాహకులు చేసే తప్పులు టీ తాగే వారి ఆరోగ్యానికి ఇబ్బందికరంగా మారుస్తుందని చెప్పక తప్పదు.

పర్యావరణాన్ని హితం చేయాలనుకుంటే టీ కప్పులు.. కాఫీ కప్పుల విషయంలో నిర్ణయాలు తీసుకునే బదులు.. పారిశ్రామిక వ్యర్థాలు.. పరిశ్రమలు విడుదల చేసే విషవాయవుల్ని సమర్థంగా అడ్డుకుంటే సరిపోతుంది కదా? అదేం దరిద్రమో.. సూది పోయేంత రంధ్రాలే కనిపిస్తాయి కానీ.. పందికొక్కులు పోయే బొక్కలు ఎందుకు కనిపించవు?