Begin typing your search above and press return to search.
టీడీపీలో వర్గ విభేదాలు..భర్తతో కలిసి మాజీ ఎమ్మెల్యే రాజీనామా!
By: Tupaki Desk | 5 Feb 2021 3:41 PM ISTఏపీలో ప్రస్తుతం పంచాయతీ వార్ కొనసాగుతుంది. దీనితో రాష్ట్రంలో రాజకీయం మళ్లీ ఒక్కసారిగా హీటెక్కింది. ఈ ఎన్నికలు పార్టీల గుర్తులపై కాకున్నా కూడా , టీడీపీ , వైసీపీ రెండూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే తోలి విడత పోలింగ్ కి అంతా సిద్ధం చేశారు. అలాగే రెండో విడత నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన టీడీపీ .. లోకల్ వార్ లో సత్తా చాటి మళ్లీ పునర్వైభవం దక్కించుకోవాలని చూస్తుంది.
ఇటువంటి సమయంలో టీడీపీ కి గట్టి షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టీడీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పదవులకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి.. ఆమె భర్త సత్యనారాయణ మూర్తి లు రాజీనామా చేశారు. అనంత లక్ష్మి కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పదవికి గుడ్ బై చెప్పారు. పదవులకు రాజీనామా చేసినా,తెలుగుదేశం పార్టీలో కొనసాగుతామని చెప్పారు.రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ ఎన్నికలను అధికార, విపక్షాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్తానాల్లో విజయం సాధించాలని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
ఈ సమయంలో కాకినాడలోని టీడీపీలో చోటు చేసుకొన్న పరిణామాలు పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అధిపత్య పోరు కారణంగానే పిల్లి దంపతులు రాజీనామా చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో చోటు చేసుకొంది. తాము చనిపోయిన తర్వాత కూడా తెలుగు దేశం పార్టీ కండువా కప్పాలని సత్తిబాబు కోరారు. ఎన్నికల్లో తమ కుటుంబం పోటీచేయదని చెప్పారు.. అనంత లక్ష్మి మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మాజీ మంత్రి చిన రాజప్ప వ్యాఖ్యలు బాధించాయని సన్నిహితులతో వారు చెప్పినట్లు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది.