Begin typing your search above and press return to search.
అసోం-మిజోరాం సరిహద్దుల్లో ఘర్షణ..గుడిసెలకి, స్టాల్స్ కి నిప్పు పెట్టిన దుండగులు !
By: Tupaki Desk | 19 Oct 2020 6:40 PM ISTఅసోం, మిజోరాం సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చెలరేగిన ఘర్షణలో పలువురు గాయాలపాలైయ్యారు. మిజోరాంలోని కోలాసిబ్, అసోంలోని కాచర్ జిల్లా సరిహద్దు శివార్లలో శనివారం సాయంత్రం ఆటో రిక్షా స్టాండ్ సమీపంలో ఉన్న కొంతమంది అసోం ప్రజలపై కర్రలు, ఆయుధాలతో దాడికి దిగారు. దీంతో అసోం వైరేంగ్ గ్రామ ప్రజలు భారీగా అక్కడకు చేరుకుని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. మిజోరాం లైలాపూర్ వాసులు జాతీయ రహదారి వెంబడి నిర్మించిన 20 గుడిసెలు, స్టాల్స్ కు నిప్పంటించారు. సరిహద్దు వెంబడి లైలాపూర్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇళ్లను దుండగులు తగులబెట్టారు.
అయితే ప్రస్తుతం పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని, హింస చెలరేగిన ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఒక్కసారిగా ఈ హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోవడంతో అసోం ముఖ్యమంత్రి అప్రమత్తమయ్యారు. ప్రస్తుత పరిస్థితి, హింస పై ప్రధాన మంత్రి కార్యాలయంతో పాటు కేంద్ర హోంశాఖకు కూడా సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతంలో అధికారులు 144 సెక్షన్ విధించారు. వైరేంగ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయిహైపుయ్ ‘వి’ గ్రామం సమీపంలో అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద విధులు నిర్వర్తించే వాలంటీర్ల గుడారాలు ఉన్నాయి. వీటికి దుండగులు నిప్పంటించడంతో ఈ హింసాత్మక ఘర్షణ చెలరేగినట్లు సమాచారం. కోవిడ్-19 నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ప్రజల కదలికలను గమనించేందుకు వాలంటీర్లను నియమించారు. మిజోరంతో దాదాపు 165 కిలోమీటర్ల మేర సరిహద్దును అసోం పంచుకుంటోంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం పరిష్కారానికి 1995 నుంచి చర్చలు కొనసాగుతున్నా.. ఫలితం పెద్దగా లేకపోయింది. దీంతో ఈ విషయంపై అసోం, మిజోరాంలు తరుచూ గొడవపడుతూనే ఉన్నాయి.
మరోవైపు సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఇరు వర్గాలు ఉమ్మడిగా ప్రయత్నిస్తేనే పరిష్కారం అవుతుందని సీఎం శర్వానంద సోనోవాలా అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతలను కాపాడడానికి ఇరు రాష్ట్రాలూ కలిసి పనిచేయాలని సోనోవాలా సూచించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగడంపై అసోం, మిజోరం ముఖ్యమంత్రులు ఫోన్లో చర్చించారు. అసోం ముఖ్యమంత్రి మిజోరం ముఖ్యమంత్రి జోరంథంగాతో ఫోన్లో మాట్లాడారు. సరిహద్దు వివాదాల పరిష్కారంలో ఇరు రాష్ట్రాలు కలిసి కట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని సోనోవాలా అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై మిజోరం ముఖ్యమంత్రి జోరంథంగా బదులిస్తూ... ‘‘ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనడానికి, సరిహద్దు సమస్యల పరిష్కారానికి తప్పకుండా సహకారం అందిస్తాం.’’ అని ప్రకటించారు