Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో రచ్చ రచ్చ

By:  Tupaki Desk   |   1 Jan 2022 10:00 AM IST
కాంగ్రెస్ లో రచ్చ రచ్చ
X
తెలంగాణా కాంగ్రెస్ లో రచ్చ మామూలుగా జరగటంలేదు. కాంగ్రెస్ లో విచిత్రం ఏమింటటే ఇఫుడు కూడా తాము అధికారంలో ఉన్నామనే నేతలు అనుకుంటున్నట్లున్నారు. అధికారంలో ఉండే పార్టీ నేతలు మధ్య అనేక విషయాల్లో గొడవలు జరుగుతుంటాయ. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా గొడవలు జరుగుతునే ఉన్నాయి. ఒక విధంగా పార్టీ కి గ్రూపుల గోలే బలమని సమర్ధించుకునే నేతలు చాలామందే ఉన్నారు.

అయితే గ్రూపుల గోల ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుండటంతోనే జనాలకు పార్టీ దూరమైపోతోంది. ఇపుడిదంతా ఎందుకంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదుచేశారు. జగ్గారెడ్డి రాసిన లేఖ మీడియాకు లీకవ్వటంతో పెద్ద గోల మొదలైంది. తాను అధిష్టానానికి రాసిన లేక మీడియాకు ఎలా లీకయ్యిందో తెలీదని జగ్గారెడ్డి అంటున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంటే లేఖను మీడియాకు లీక్ చేశారని రేవంత్ మద్దతుదారులంటున్నారు.

ఇదే విషయమై పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి విచారణ జరిపారు. లేఖ లీకు విషయమై జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుగానే భావిస్తున్నట్లు చెప్పారు. తొందరలోనే వివరణ తీసుకునేందుకు క్రమశిక్షణసంఘం ముందుకు పిలవనున్నట్లు చెప్పారు. చిన్నారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఆగ్గికి ఆజ్యం పోసినట్లయ్యింది. నిజానికి పార్టీకి ఒక కర్త, కర్మ, క్రియ అంటు ఉండదు. ఏ నేత ఎవరిగురించైనా మాట్లాడేస్తుంటారు. షోకాజ్ నోటీసులు జారీ అవ్వటం, వాటిని సదరు నేతలు లెక్కచేయకూపోవటం మామూలుగా జరుగుతునే ఉంటాయి.

అసలు క్రమశిక్షణే లేని పార్టీకి మళ్ళీ క్రమశిక్షణా సంఘం ఒకటి. ఈ పార్టీలో ఎవరు ఎవరినీ లెక్కచేయరు. ఏఐసీసీలో కీలక నేతలనే లెక్కచేయని పీసీసీ నేతలను క్రమశిక్షణా సంఘం ఏమి చేస్తుంది. రేపు క్రమశిక్షణా సంఘం ముదు హాజరైనా తాను రాసిన లేఖ ఎలా లీకైందో తెలీదనే జగ్గారెడ్డి చెబుతారు. అప్పుడు చిన్నారెడ్డి ఏమి చేయగలరు ? పైగా జగ్గారెడ్డి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. వర్కింగ్ ప్రెసిడెంట్ పై యాక్షన్ తీసుకునేంత సీన్ క్రమశిక్షణాసంఘానికుందా ?

కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహారం మొదటినుండి ఇలాగే ఉంటుంది. ప్రజాస్వామ్యం బాగా ఎక్కువైపోయినే కారణంగానే నేతల మధ్య ఇలాంటి గొడవలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు కేసీయార్ పరిపాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని చెబుతునే దాన్ని అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్రయత్నించటంలేదు. ఒకవేళ ప్రభుత్వానికో లేకపోతే కేసీయార్ కో వ్యతిరేకంగా రేవంత్ ఏదన్నా నిరసన కార్యక్రమం పెట్టుకున్నా వెంటనే పదడుగులు వెనక్కు లాగే నేతలు చాలామందే రెడీగా ఉంటారు. అందుకనే పార్టీలో రచ్చ రచ్చ జరుగుతోంది. ఈ పార్టీ మారదంతే.