Begin typing your search above and press return to search.
కరోనా భయంతో జైలుకు నిప్పంటించిన ఖైదీలు
By: Tupaki Desk | 22 March 2020 3:01 PM ISTకరోనా భయం దేశమంతా వ్యాపించిందనడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. కరోనా వైరస్ భయంతో ప్రజలను ఈ ఆదివారం బయటకు రావద్దని ప్రధాని మోడీ పిలుపునిచ్చాడు. దీంతో ఇంట్లోనే ఉంటూ అందరూ స్వచ్ఛంద నిర్బంధం పాటిస్తున్నారు.
అయితే కరోనా వైరస్ భయం ఖైదీలను కూడా ఎదురుతిరిగి రచ్చ రచ్చ చసేలా చేసింది. బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా దమ్ దమ్ కేంద్ర ఖారాగారంలో కరోనా వైరస్ భయంతో ఖైదీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమను జైలు నుంచి బెయిల్ పై విడుదల చేయాలని.. కరోనా బారిన పడకుండా ఇంటికి పంపించాలని ఖైదీలు ఆందోళన చేశారు.
ఇక ఈ ఆందోళనతో కొంత మంది ఖైదీలు ఏకంగా జైలు అధికారులపై దాడికి పాల్పడినట్టు తెలిసింది. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఖైదీలను చెదరగొట్టారు. ఈ దాడిలో పలువురు ఖైదీలకు గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ఈ ఉద్రిక్తతతోనే కొంత మంది ఖైదీలు ఆగ్రహంతో జైలుకు నిప్పంటించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు.
ఈ ఆందోళనతో పదేళ్లకు పైగా జైలు జీవితం గడుపుతున్న ఖైదీలకు పెరోల్ ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. 31 వరకు ఖైదీలతో ములాఖత్ లు బంద్ చేశారు.