Begin typing your search above and press return to search.
కొవ్వూరు తమ్ముళ్ల మధ్య కొట్లాట.. రీజన్ ఇదే!
By: Tupaki Desk | 3 Oct 2020 9:46 AM ISTపశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గడిచిన ఏడాదిన్నరగా ప్రశాంతంగా ఉన్న టీడీపీ నాయకులు మళ్లీ రెచ్చిపోతున్నారు. తమ మాట, తమ డిమాండ్‌ను పార్టీ అధినేత చంద్రబాబు వింటారా? వినరా? అనివారు ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? తమ్ముళ్లు ఎందుకు ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అనే విషయాలను పరిశీలిస్తే.. కొవ్వూరు నియోజకవర్గంలో 2014లో జవహర్‌కు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. ఈ నియోజకవర్గం వాస్తవానికి ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. పైగా టీడీపీకి కంచుకోట. అయితే, ఈ నియోజవర్గంలో కాపు, కమ్మ వర్గాల డామినేషన్ ఎక్కువ. దీంతో ఎమ్మెల్యేగా ఎస్సీ నేత గెలుపు గుర్రం ఎక్కడంలో ఈ రెండు సామాజిక వర్గాలే.. ప్రధాన పాత్ర పోషిస్తాయి.
2014లో జవహర్ గెలుపు గుర్రం ఎక్కడంవెనుక కూడా కమ్మ, కాపు వర్గాలు ప్రధానంగా చక్రం తిప్పాయి. ఆయన గెలిచారు. తర్వాత మంత్రి కూడా అయ్యారు. అయితే.. ఈ వర్గాలను ఆయన పట్టించుకోవడం మానేశారు. కొత్తగా ఎస్సీ వర్గాల నుంచి నేతలను తయారు చేసి.. వారిని ప్రోత్సహించడం ప్రారంభించారు. అప్పట్లో చిన్నపాటి కాంట్రాక్టర్లను కూడా నియోజకవర్గానికి అప్పగించ లేదనే విమర్శలు కూడా జవహర్‌పై ఉన్నాయి. అయినప్పటికీ.. ఆయన వ్యవహార శైలి మారకపోవడంతో గత ఏడాది ఎన్నికల సమయంలో అసలు జవహర్‌కు టికెట్ ఇవ్వరాదనే డిమాండ్ తెరమీదికి వచ్చింది. దీంతో విధిలేక చంద్రబాబు ఆయనను తిరువూరుకు బదిలీ చేశారు.
దీంతో కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి కొంత మేరకు శాంతించింది. అయితే, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో నాయకులు ఫైరవుతున్నారు. జవహర్‌ను ఇప్పుడు తాజాగా చేపట్టిన పార్లమెంటరీ నియోజకవర్గాల్లో రాజమండ్రి ఇంచార్జ్‌గా నియమించారు. అయితే, త్వరలోనే కొవ్వూరు నియోజకవర్గం ఇంచార్జ్‌గా కూడా నియమించేందుకు బాబు పావులు కదుపుతున్నారని తెలిసింది. ఇదే విషయంపై స్థానికంగా కొవ్వూరు నాయకులు మండిపడుతున్నారు. గతంలో ఆయన తమను పట్టించుకోలేదని.. అందుకే తిరస్కరణకు గురయ్యారని, ఇప్పుడు మళ్లీ తెచ్చి మాపై రుద్దేందుకు ప్రయత్నిస్తుండడం సరికాదని ఇక్కడ నాయకులు చెబుతున్నారు. ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యతిరేకించేందుకు మళ్లీ రెడీ అవుతున్నారు. మరి ఈ వ్యతిరేకతను చంద్రబాబు ఎలా తప్పించుకుంటారో చూడాలి.