Begin typing your search above and press return to search.
కరోనా సెకండ్ వేవ్ పై మంత్రి ఈటల క్లారిటీ
By: Tupaki Desk | 1 Jan 2021 3:01 PM ISTప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. శీతాకాలం రావడం.. యూరప్ సహా ఉత్తరాన ఉన్న దేశాలన్నింటిని కొత్త కరోనా వైరస్ పట్టేసి వందలాది మందికి సోకుతూ ప్రాణాలు తీస్తోంది. విస్తృతంగా వ్యాపిస్తోంది.
ఈ క్రమంలోనే బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ అందరినీ భయపెట్టింది. బ్రిటన్ నుంచి దేశానికి వచ్చిన వారి ద్వారా అక్కడి వైరస్ మన తెలంగాణకు పాకింది. కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందన్న ఊహాగానాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఖండించాడు.
తాజాగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో కరోనా ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. కొందరు సోషల్ మీడియాలో దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకమైన ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు సూచించారు.
బ్రిటన్ నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపిన మంత్రి ఈటల.. వారిలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను సీసీఎంబీకి పంపించామని తెలిపారు.ఇప్పటివరకు ఒకరికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే 10వేల మంది సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తామని మంత్రి ఈటల తెలిపారు. ఆ తరువాత రోజుకు 10లక్షలమందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటల వెల్లడించారు.